మబ్బే మసకేసింది అంటూ.. మనోజ్‌తో మాస్ స్టెప్పులేసిన ఈ బ్యూటీ గుర్తుందా..!
మనోజ్ మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా మనోజ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే మరి కొన్ని సినిమాలను కూడా లైనప్ చేశాడు మనోజ్.
మంచు మనోజ్ హీరోగా నటించిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యూత్ లో మనోజ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న మనోజ్ ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ కానున్నాడు. త్వరలోనే ఆయన మిరాయ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాలో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా మనోజ్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే మరి కొన్ని సినిమాలను కూడా లైనప్ చేశాడు మనోజ్. ఇదిలా ఉంటే మనోజ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో నేను మీకు తెలుసా సినిమా ఒకటి. ఈ సినిమా మనోజ్ కు మంచి విజయాన్ని అందించింది. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో మనోజ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.
ఇది కూడా చదవండి : వాయమ్మో.. ! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్.. ఎందుకు ఇలా
ఈ సినిమాలో మనోజ్ కు జోడీగా స్నేహ ఉల్లాల్, రియా సేన్ నటించారు. ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మి మంచు నిర్మించింది. ఈ చిత్రాన్ని తమిళంలో ఎన్నై థెరియుమా … ? విడుదల చేశారు. ఈ సినిమాకు అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో పాటలను అచ్చు, ధరణ్ స్వరపరిచారు. నేపథ్య స్కోర్‌లను సంతోష్ నారాయణన్, శక్తి అందించారు.
ఇది కూడా చదవండి :Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్
ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. అలాగే ఈ మూవీలో ఓ ఓల్డ్ సాంగ్ ను రీమేక్ చేశారు. మబ్బే మసకేసింది అనే సాంగ్ ను రీమిక్స్ చేశారు. అయితే ఈ సాంగ్ లో మనోజ్ తో స్టెప్పులేసి బ్యూటీ గుర్తుందా.? మాస్ స్టెప్పులతో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఆ భామ. ఆమె పేరు కౌశ రాచ్. ఈ అమ్మడిని చాలా మంది గుర్తుపడతారు కానీ ఆమె పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ చాలా సినిమాల్లో నటించింది ఆమె. తెలుగులో కుబేరులు, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, భగవంతుడు, ప్రారంభం, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, ఆలస్యం అమృతం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా..
ఇది కూడా చదవండి:Tollywood: ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.