Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.. తెలుగులో కూడా

మొన్నీమధ్య వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా చేసిన అమ్మాయిలు.. ఇంతలోనే హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. వరుస అవకాశాలు అందుకుంటూ తమ మార్క్ చూపిస్తున్నారు. రాక్షసుడు చిత్రంలో హీరో.. మేనకోడలిగా నటించిన పాప గుర్తుందా..? తను ఇప్పుడు హీరోయిన్..

Tollywood: అమ్మబాబోయ్.. ఈ పాప ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.. తెలుగులో కూడా
Abhirami
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 30, 2024 | 12:22 PM

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు జోరు చూపిస్తున్నాడు. టాప్ హీరోగా ఎలివేట్ అయ్యేందుకు మంచి కథలు ఎంచుకుంటున్నాడు. అల్లుడు శ్రీను చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రొడ్యూసర్ తనయుడు.. జయ జానకి నాయకతో ఫస్ట్ హిట్ టేస్ట్ చేశాడు. కాగా తమిళ్ సినిమా రట్సాసన్ మూవీకి రీమేక్‌గా రాక్షసుడు అనే మూవీ చేయగా అది బ్లాక్ బాస్టర్ అయింది.  ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ యాక్ట్ చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ మూవీ మంచి వసూళ్లు కూడా రాబట్టింది.  కాగా ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మేనకోడలిగా నటించిన అమ్మాయి గుర్తుందా..? తన చుట్టూనే సినిమా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అభిరామి. రాక్షసుడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు హీరోయిన్‌గా సినిమాలు చేస్తోంది. అంతే కాదు తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. విద్యా సాగర్ రాజు దర్శకత్వంలో వచ్చిన F.C.U.K (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) మూవీలో నటించింది. ఈ చిత్రంలో అభిరామి నటనకు మంచి పేరు వచ్చింది.

అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ చిత్రంలోనూ బాలనటిగా చేసింది. ఇంతలోనే ఆమె హీరోయిన్ అయిపోవడంతో నెటిజన్స్ నివ్వెరపోతున్నారు. మణిరత్నం తీసిన “నవరస” వెబ్ సిరీస్ అభిరామి నటించింది. ఆమె హీరోయిన్‌గా మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు మంచి యాక్టీవ్. ఇన్‌స్టాలో తనకు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫోటోలతో పాటు ఫిల్మ్ అప్‌డేట్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!