Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్

స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది వాటిలో సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయం అయ్యింది.

Sneha: నా ఫేవరెట్ హీరో అతనే.. ఓపెన్‌గా చెప్పిన స్నేహ.. ఆనందంలో ఫ్యాన్స్
Sneha
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2024 | 1:20 PM

స్నేహ.. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది వాటిలో సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు. ఆతర్వాత ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ భామ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది. చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతోనూ ఆకట్టుంది స్నేహ.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

తెలుగులో వరుసగా హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు,మహారధి,మధుమాసం,సంక్రాంతి,వెంకీ,ఏవండోయ్ శ్రీవారు,పాండురంగడు లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆతర్వాత స్నేహ ఈ మధ్యకాలంలో సహాయక పాత్రల్లో నటిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన s/o సత్యమూర్తి, రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధయ రామ సినిమాల్లో సహయక పాత్రల్లో మెరిసింది స్నేహ. కాగా రీసెంట్ గా దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలో ఆయన భార్యగా చేసి ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!

స్నేహ తమిళ్ లోనూ చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. విజయ్, అజిత్, కమల్, సూర్య, ప్రశాంత్, ధనుష్ లతో నటించింది. ముఖ్యంగా దళపతి విజయ్, అజిత్ లతో ఆమె సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరో ఎవరు అనేదానికి సమాధానం చెప్పారు. స్నేహ మాట్లాడుతూ.. తనకు అజిత్ అంటే ఇష్టమని అన్నారు. ఇక స్నేహ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. నటనకు ప్రదాన్యత పాత్రలను ఎంచుకుంటున్నారు స్నేహ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

View this post on Instagram

A post shared by Sneha (@realactress_sneha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?