Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!

సౌందర్య గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆమె అందం, నటన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికి నిలిచే ఉంటుంది. స్టార్ హీరోలు కూడా సౌందర్య డేట్స్ కోసం ఎదురుచూసేవారు. తెలుగు తమిళ్ భాషలతో పాటు హిందీలోనూ సత్తా చాటారు సొందర్య.

Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!
Soundarya
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2024 | 8:38 AM

సౌందర్య.. తెలుగు ప్రేక్షకులు మరిచిపోని పేరు ఆమెది. ఆమె రూపం, నటన ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ళముందు కదలాడుతూ ఉంటాయి. చనిపోవాల్సిన వయసు కాదు.. అనారోగ్యం లేదు కానీ అనుకోని ప్రమాదంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది సౌందర్య. ఇప్పటికీ ఏ ఎంతో మంది ఫేవరెట్ హీరోయిన్. సౌందర్య సినిమా వస్తుందంటే చాలు అలా టీమ్ ముందు కదలకుండా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఎంతో పద్దతిగా హుందాగా. ప్రతి పాత్రకు జీవం పోసి ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు సౌందర్య. ఆమె కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి వాటిలో ఒక్కటే అమ్మోరు. ఈ సినిమానే సౌందర్యను ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

దర్శకుడు కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాతో సౌందర్య తన నటవిశ్వరూపం చూపించారు. సౌందర్య నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అప్పటికి ఉన్న టెక్నాలజీతో అద్భుతమైన గ్రాఫిక్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారు కోడి రామకృష్ణ. ఈ సినిమాలో సౌందర్య ప్రధాన పాత్రలో నటించగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో మెప్పిచారు. ఇక సౌందర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఈ సినిమాలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పొచ్చు.

సౌందర్య నటన చూసి స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యిపోయారు. అమ్మోరు సినిమా తర్వాత సౌందర్య కెరీర్ స్పీడ్ అందుకుంది. ఆమె క్రేజ్ డబుల్ అయ్యింది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూసే స్టేజ్ కు ఎదిగింది. ఇదిలా ఉంటే ఆ సినిమా అప్పటిలో రూ. 2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 30 ఏళ్లు అవుతుంది. అప్పట్లో రూ. 2 కోట్ల బడ్జెట్ అంటే ఇప్పుడు దాదాపు రూ. 60కోట్లకు సమానం.. అయితే ఈ సినిమా కోసం సౌందర్య తీసుకున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రూ. 2 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పటిలో రూ. 10కోట్లకు పైగా వసూల్ చేసింది. అయితే ఈ సినిమాకు సౌందర్యకు కేవలం రూ. 45 వేలు మాత్రమే ఇచ్చారట. సినిమా పెద్ద హిట్ అయ్యి లాభాలు వచ్చిన తర్వాత నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సౌందర్యకు రూ. లక్షరూపాయలు ఇవ్వాలనుకున్నారట. కానీ సౌందర్య వద్దు అని చెప్పారట. సినిమా ఆఫర్ ఇవ్వడమే పెద్ద గిఫ్ట్ అని సౌందర్య అన్నారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?