AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Hero : ఈ టాలీవుడ్ హీరో చేసింది 18 సినిమాలు అందులో 16 ఫ్లాప్స్.. అయినా కూడా..

చిన్న చిన్న హీరోలు, టైర్ 2 హీరోలు కూడా మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఓ హీరో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు హిట్ మాత్రం దక్కడం లేదు.

Tollywood Hero : ఈ టాలీవుడ్ హీరో చేసింది 18 సినిమాలు అందులో 16 ఫ్లాప్స్.. అయినా కూడా..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Oct 28, 2024 | 8:38 AM

Share

సినిమా ఇండస్ట్రీ చాలా మంది హీరోలు హిట్స్ ఫ్లాప్స్ అంటూ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఈ మధ్య చిన్న సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. చిన్న చిన్న హీరోలు, టైర్ 2 హీరోలు కూడా మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే ఓ హీరో మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఆయనకు హిట్ మాత్రం దక్కడం లేదు. మంచి కటౌట్ ఆయన, నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కానీ ఎందుకో సినిమాలు మాత్రం అంతగా హిట్ అవ్వడం లేదు. అయినా కూడా ఆ హీరో ఎక్కడ తగ్గడం లేదు వరుసగా సినిమాలను చేస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఆ హీరో సాలిడ్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇంతకూ ఆ హీరో ఎవరో కాదు.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

ఆ హీరోగారు చేసింది 18 సినిమాలు కానీ అందులో హిట్ అయ్యింది మాత్రం 16 ఫ్లాప్ అయ్యాయి. కేవలం రెండు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇంతకూ ఆ హీరో ఎవరో కాదు.. రీసెంట్ గా నవ దళపతి అనే ట్యాగ్ ను సొంతం చేసుకున్న సుధీర్ బాబు. ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. మహేష్ బాబు చెల్లి భర్త సుధీర్ బాబు.

ఇది కూడా చదవండి : Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!

ఈ యంగ్ హీరో శివ మనసులో శృతి అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు ఏ మాయ చేశావే సినిమాలో సమంత అన్నగా నటించాడు. ఆతర్వాత హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. శివ మనసులో శృతి సినిమా తర్వాత ప్రేమకథా చిత్రమ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు సుదీర్ బాబు. ఇక 2018లో సమ్మోహనం సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ రెండు సినిమాలు తప్ప సుధీర్ బాబు కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమా లేదు. సుధీర్ బాబు చివరిగా హరోం హర,మా నాన్న సూపర్‌హీరో సినిమాలు కాస్త పర్లేదు అనిపించుకున్నాయి. అయినా కూడా సుధీర్ బాబు మాత్రం సాలిడ్ హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ఈ యంగ్ హీరో హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..