Bigg Boss 8 Telugu: “అవ్వ నీకు నేనున్నా.. మాట ఇస్తున్నా”.. మెహబూబ్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న గంగవ్వ
బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఎపిసోడ్ సందడి గా జరిగింది. కింగ్ నాగార్జున హౌస్ మేట్స్ తో ఆటలు ఆడించారు. అలాగే కంగువా, క, లక్క భాస్కర్, అమరన్ టీమ్ లు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. అందరికంటే సూర్య నిన్నటి ఎపిసోడ్ లో హైలైట్ గా నిలిచాడు.
బిగ్ బాస్ హౌస్ లో దీపావళి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నిన్నటి ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున సందడి చేశారు. దీపావళి రోజులు కావడంతో నిన్న పండగ స్పెషల్ ఎపిసోడ్ జరిగింది. సినిమా సెలబ్రెటీలు హీరో సూర్య బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశాడు. అలాగే నిన్న ఎలిమినేషన్ కూడా జరిగింది. ముందుగా హౌస్ మేట్స్ తో సరదాగా గేమ్స్ ఆడించిన నాగార్జున చివర్లో ఎలిమేషన్ తో షాక్ ఇచ్చాడు. బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా, ఆదిత్య ఓమ్, సీత, మణికంఠ ఇలా వరుసగా ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. కాగా నిన్నటి ఎపిసోడ్ లో మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు.
కంగువా, క, లక్క భాస్కర్, అమరన్ టీమ్ లుసినిమా ప్రేమోషన్స్ లో భాగంగా నిన్న బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశాయి. వీరితో పాటు అనసూయ డ్యాన్స్ పర్ఫామెన్స్, సమీరా భరద్వాజ్ పాటలు, హైపర్ ఆది కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కాగా నిన్నటి ఎపిసోడ్ లో నయనిపావని మెహబూబ్ ఎలిమినేషన్స్ లో చివరి వరకు వచ్చారు. లాస్ట్ లో నయని సేవ్ అయ్యింది. దాంతో మెహబూబ్ హౌస్ వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఎలిమినేట్ అయిన మెహబూబ్ స్టేజ్ పైకి వచ్చి తన జర్నీ చూసి ఎమోషనల్ అయ్యాడు.
ఆ తర్వాత హౌస్ మేట్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పమని నాగ్ చెప్పగా.. దీపావళి కాబట్టి క్రాకర్స్‌తో కంటెస్టెంట్లను పోల్చారు. అవినాష్ ను థౌజండ్ వాలా అని చెప్పాడు మెహబూబ్. ఏటర్టైన్మెంట్ బాగా ఇస్తాడు అని చెప్పాడు. ఆతర్వాత గంగవ్వ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. గంగవ్వను లక్ష్మీ బాంబ్ తో పోల్చిన మెహబూబ్. అవ్వ నీకు నేనున్నా.. నీకు ఏ సాయం కావాలన్న నేనుంటా.. నీ చిన్న బిడ్డ గురించి చెప్పావ్ కదా.. నేను చేస్తా మాట ఇస్తున్న అని చెప్పాడు. మెహబూబ్ మాటలకూ గంగవ్వ కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ఆతర్వాత నబీల్ ను రాకెట్ అని, రోహిణిని కాకరపూవత్తి, గౌతమ్‌లో లో ఫైర్ ఉంది ఇంకా బయటకు తీయాలి అని చెప్పాడు. ఆతర్వాత పోయిన సారి కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అవుతున్నా అంటూ బాధపడ్డాడు మెహబూబ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.