Tollywood: ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే

బాబీ సింహ 2013లో తమిళ సినిమా 'కదలిల్ సోదప్పువదు ఎప్పడి' సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తెలుగు, మలయాళం, కన్నడ భాషా సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా మారిపోయాడు ఈ వర్సటైల్ యాక్టర్.

Tollywood: ఏంటీ..! ఈ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయినా..! ఎవరితో నటించందంటే
Bobby Simha
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2024 | 11:23 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది విలన్స్ గా నటించి మెప్పించారు. కొంతమంది హీరోలు విలన్స్ గానూ తమ సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో నటుడు బాబీ సింహ ఒకరు. హైదరాబాద్‌లోని మౌలాలీలో పుట్టి పెరిగిన బాబీ సింహ తమిళ్‌లో నటుడిగా రాణించాడు. సిద్ధార్థ్ హీరోగా నటించిన లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాతో తెలుగులో తొలిసారి పరిచయం అయ్యాడు బాబీ సింహ. ఆతర్వాత ఎక్కువగా తమిళ్ లోనే నటించాడు. తమిళ్ లో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించాడు ఈ వర్సటైల్ యాక్టర్. ఇక ఆయన నటించిన జిగర్తాండా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇదే సినిమాను తెలుగులో గద్దల కొండ గణేష్ పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ వరుణ్ తేజ్ పోషించిన పాత్రను అక్కడ బాబీ సింహ చేశారు. ఆతర్వాత బాబీ సింహ క్రేజ్ పెరిగిపోయింది. తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లోనూ నటించాడు.

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

తెలుగులో రన్, ఏదైనా జరగొచ్చు, డిస్కో రాజా,అమ్ము, గల్లీ రౌడీ, సినిమాలు చేశాడు. ఆతర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోనూ నటించి మెప్పించాడు. ఈ సినిమాతో బాబీ సింహకు మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులోనూ ఈ విలన్ పేరు పాపులర్ అయ్యింది. వాల్తేరు వీరయ్య సినిమా తరవాత రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ లోనూ నటించాడు. ఈ సినిమాలో బాబీ కీలక పాత్రలో మెరిశాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!

ఇదిలా ఉంటే బాబీ సింహ భార్య తెలుగులో హీరోయిన్ గా నటించింది. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. బాబీ సింహ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. బాబీ సింహ సతీమణి పేరు రెష్మీ మీనన్. ఆమె తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. రేష్మీ 2002లో బాలనటిగా, 2010లో తమిళ సినిమా ‘ఇనిధు ఇనిధు’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె పూరిజగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన నేనోరకం సినిమాలో హీరోయిన్ గా చేశారు.అలాగే 2018లో రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన హైదరాబాద్ లవ్ స్టోరి సినిమాలోనూ హీరోయిన్ గా నటించారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలితోనే గడిపేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Reshmi Menon (@kreshmenon)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?