ఒకప్పుడు సెక్యూరిటీ గార్డు.. ఇప్పుడు స్టార్ హీరోలకన్నా ఫేమస్.. ఒకొక్క సినిమాకు రూ.10కోట్లు అందుకుంటున్న యాక్టర్
సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు విలన్స్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది విలన్స్ గానూ మెప్పించి ఆకట్టుకుంటున్నారు. ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.? విలనిజంతో ఎంతో మంది అబిమానులను సొంతం చేసుకున్నారు .

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎంతో కష్టపడి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్స్ గా, చిన్న పాత్రలు చేస్తూ ఆతర్వాత హీరోలుగా, హీరోయిన్స్ రాణిస్తున్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేక అలమటించిన వాళ్లు ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారు. ఒకొక్క సినిమాకు కోట్లల్లో రెమ్యునరేషన్స్ అందుకుంటూ స్టార్ గా రాణిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు ఇండియాలోనే వర్సటైల్ యాక్టర్.. విలన్ గా అద్భుతమైన నటనతో మెప్పించాడు. అంతే కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పుడు సెక్యూరిటీ గార్డ్ గా పని చేసిన ఆయన ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ టాలెంటడ్ యాక్టర్ గా రాణిస్తున్నాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? అతను మరెవరో కాదు..
ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ
పై ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడిని గుర్తుపట్టారా.? చూడటానికి అమాయకుడిలా కనిపిస్తున్న అతను ఇండస్ట్రీలో క్రేజీ విలన్. చూడటానికి సన్నగా ఉన్నప్పటికీ తన విలనిజంతో ప్రేక్షకులను భయపెట్టాడు. అతను ఎవరో కాదు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఉత్తరప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో నవాజుద్దీన్ జన్మించారు. కెరీర్ ప్రారంభంలో ఆయన కెమిస్ట్‌గా, ఆ తర్వాత ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్‌గా కూడా పనిచేశారు.
ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను
నటనపై ఉన్న ఆసక్తితో ఢిల్లీలోని ప్రతిష్టాత్మక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి యాక్టింగ్ నేర్చుకున్నారు. ముంబై వచ్చిన కొత్తలో దాదాపు ఒక 10 ఏళ్లు పాటు కేవలం చిన్న చిన్న పాత్రలు, జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తూ తీవ్రంగా స్ట్రగుల్ చేశారు. ‘సర్ఫరోష్’, ‘మున్నాభాయ్ MBBS’ వంటి సినిమాల్లో ఆయన సెకన్ల పాటు కనిపించే పాత్రలు చేశారు. 2010 తర్వాత ఆయన కెరీర్ పూర్తిగా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం గ్లామర్, సిక్స్ ప్యాక్ బాడీలే కాదు… గట్టి ప్రతిభ, పట్టుదల ఉంటే చాలని నిరూపించిన గొప్ప నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన సైందవ్ సినిమాలో విలన్ గా నటించాడు నవాజుద్దీన్ సిద్దిఖీ.
ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..
View this post on Instagram




