AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7ఏళ్ళవయసులోనే మా నాన్న ఫ్రెండ్ వేధించాడు.. జీవితం మొత్తం కష్టాలే.. కన్నీళ్లు పెట్టుకున్న తమ్ముడు బ్యూటీ..

ఒకప్పటి సినిమాల్లో నటించిన హీరోయిన్స్ ను ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అసలు ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారా.? అని ఆరా తీస్తుంటారు కొందరు. ఇలా ఆరా తీస్తున్న ముద్దుగుమ్మల్లో ఈ భామ కూడా ఒకరు. ఈ బ్యూటీ అందానికి అప్పట్లో కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆ భామ.

7ఏళ్ళవయసులోనే మా నాన్న ఫ్రెండ్ వేధించాడు.. జీవితం మొత్తం కష్టాలే.. కన్నీళ్లు పెట్టుకున్న తమ్ముడు బ్యూటీ..
Aditi Govitrikar
Rajeev Rayala
|

Updated on: May 21, 2026 | 6:48 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాల్లో సెన్సేషన్ హిట్ అయినా సినిమా తమ్ముడు. పవన్ కు యూత్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగనే థియేటర్స్ దగ్గర జాతర వాతావరణం కనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో తమ్ముడు సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. తమ్ముడు సినిమాతో పవన్ కు యూత్ లు క్రేజ్ రెట్టింపయ్యింది. ఇక ఈ సినిమాలో పవన్ ఓ హై క్లాస్ అమ్మాయి వెంటపడుతూ ఉండే సీన్స్ హైలైట్ గా అనిపిస్తాయి. ఆ అమ్మాయి కోసం పవన్ చేసే పనులు నవ్వుతెప్పిస్తాయి. ఆ బ్యూటీ గుర్తుందా..? సినిమాలో ఆమె పేరు లవ్లీ. పవన్ కు ఈ హీరోయిన్ మధ్య వచ్చిన హే పిల్ల నీపేరు లవ్లీ సాంగ్ అప్పట్లో టాలీవుడ్ ను షేక్ చేసింది.  ఇప్పటికీ ఈ సాంగ్ అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది.

ఇది కూడా చదవండి : సినిమా వచ్చి 22ఏళ్లు.. కుర్రాళ్ళు థియేటర్స్‌లో ఎగబడి చూశారు.. ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని మూవీ

ఇప్పుడు ఆ భామ ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అయిపోతారు. ఈ అమ్మడి పేరు అదితి. స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా తమ్ముడు సినిమాలో ఈ బ్యూటీ మంచి రోల్ చేసింది. తమ్ముడు సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఆ చిన్నది. ఇక తమ్ముడు సినిమా హిట్ అయిన తర్వాత టాలీవుడ్ లో బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తమ్ముడు తర్వాత పెద్దగా ఆమె కనిపించలేదు. తమ్ముడు సినిమా కంటే ముందు ఈ బ్యూటీ టెలివిజన్ నటిగా, హోస్ట్‌గా కూడా ఆకట్టుకుంది.. ‘తమ్ముడు’ తర్వాత హిందీలో నటించింది. ప్రస్తుతం అదితి సినిమాలు తగ్గించింది . మొన్నామధ్య ‘మిస్ మ్యాచ్డ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.. తారక్ చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను

తాజాగా అదితి ఓ ఇంట్గర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. నిజ జీవితంలో డాక్టర్, ఫేమస్ సైకాలజిస్ట్ అయిన అదితి. భర్తతో విడిపోయి డాక్టర్ గా రాణిస్తుంది. ఇక ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. చిన్నవయసులోనే అంటే ఆరు, ఏడేళ్ల వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కున్నా.. నన్ను శారీరకంగా ఇబ్బందిపెట్టిన వారిలో నా తండ్రి స్నేహితుడు కూడా ఉన్నాడు. ఆ దారుణమైన సంఘటన నుంచి కోలుకోవడానికి చాలా కాలంపట్టిందని ఎమోషనల్ అయ్యింది అదితి. అలాగే చదువుకునే రోజుల్లోనూ ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా..ఆ కష్టాలే జీవితంలో ఎలా బతకాలో తనకు నేర్పించాయని తెలిపింది. 49 ఏళ్ల అదితి ఇప్పటికీ అదే అందంతో ఆకట్టుకుంటుంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇది కూడా చదవండి : ఇది కదా సినిమా అంటే..! రూ.10లక్షలు పెడితే.. రూ.10కోట్లలకు పైగా కలెక్షన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us