AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: జయకృష్ణ మొదటి సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాం.. 'శ్రీనివాస మంగాపురం'పై మహేష్ బాబు

Mahesh Babu: జయకృష్ణ మొదటి సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాం.. ‘శ్రీనివాస మంగాపురం’పై మహేష్ బాబు

Basha Shek
| Edited By: |

Updated on: Jul 27, 2026 | 6:00 PM

Share

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. ఆర్ఎక్స్ 100, మంగళవారం సినిమాలతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ మరో మూడు రోజుల్లో వెండితెరపై కనిపించనున్నాడు. అతను హీరోగా నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం జులై 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన అజయ్ భూపతి జయకృష్ణ డెబ్యూ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతరు రషా తడానీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. తిరుపతి పుణ్యక్షేత్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథా చిత్రం ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జయకృష్ణతో పాటు శ్రీనివాస మంగాపురం చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక వీడియోను రిలీజ్ చేవారు. తన అన్నయ్య రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ చేస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా గురించి మహేష్ బాబు స్పందించారు. జయకృష్ణ డెబ్యూ గురించి తమ కుటుంబం అంతా ఎగ్జైటింగ్‌గా ఉన్నామని.. కచ్చితంగా ఈ సినిమాతో జయకృష్ణ, రషా హిట్ అందుకుంటారని నమ్మకంగా తెలిపారు మహేష్. తన ‘రాజకుమారుడు’ విడుదలైన జూలై 30నే ‘శ్రీనివాస మంగాపురం’ విడుదలవుతుందని.. ఇది కచ్చితంగా అశ్వినీదత్ ప్లాన్ చేసుంటారని చెప్పారు సూపర్ స్టార్. మరి జయకృష్ణ గురించి మహేష్ ఇంకేం మాట్లాడారో ఈ వీడియోలో చూద్దాం రండి.

Published on: Jul 26, 2026 01:38 PM
Follow Us