ఇదేంది మావ.. ! ఈ హీరోయిన్ ఇంతమారిపోయిందేంటీ.! ఎన్టీఆర్‌తో నటించిన ఈమె ఎవరో తెలుసా.?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. దేవర సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఎక్కడ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. రాజమౌళి సినిమా తర్వాత ఎక్కడ ఫ్లాప్ పడుతుందో అని అభిమానులు ఆందోళన పడ్డారు. కానీ దేవర సినిమా హిట్ అవ్వడంతో పాటు భారీ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. ఎన్టీఆర్ డాన్స్, డైలాగ్ డెలివరీకి ప్రపంచం మొత్తం ఊగిపోతోంది. రీసెంట్ గా దేవర సినిమాతో భారీ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర2తో పాటు మరికొన్ని సినిమాలను కూడా లైనప్ చేశాడు. ఇక దేవర సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.. ఇక దేవర సినిమా సంచలన విజయం అందుకోవడంతో పాటు కలెక్షన్స్ పరంగాను భారీ కలెక్షన్స్ రాబట్టింది. దేవర సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించారు. బాలీవుడ్ అందాల భామ జాన్వికపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోయిన్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆ అమ్మడు ఇప్పుడు గుర్తుపట్టాలనేంతగా మారిపోయింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? కనిపెట్టడం చాలా కష్టం గురూ..
ఇది కూడా చదవండి : ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో.. ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది.. కానీ ఇప్పుడు
ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ సుబ్బు మూవీ ఒకటి. సుబ్బు సినిమా ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దాగ్గర నిరాశపరిచింది. రుద్రరాజు సురేష్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టూడెంట్ నెం.1 లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వచ్చిన సుబ్బు సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆమె పేరు సోనాలి జోషి.
ఇది కూడా చదవండి :ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
సుబ్బు సినిమా నిరాశపరచడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. సుబ్బు సినిమ తర్వాత సందడే సందడి, నాన్న నేను అబద్ధం, రాంబాబు గాడి పెళ్లాం వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు కూడా నిరాశపరచడంతో ఈ చిన్నదానికి గుర్తింపు దక్కలేదు. దాంతో ఈ చిన్నదానికి మెల్లగా అవకాశాలు తగ్గాయి. దాంతో ఇప్పుడు పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. సినిమాలకు దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఈ చిన్నది ఇప్పుడు గుర్తుపట్టాలనేంతగా మారిపోయింది.
ఇది కూడా చదవండి :ఆమె అంటే నాకు పిచ్చి.. ఆ అందానికే నేను పడిపోయా.. నాని ఫేవరెట్ హీరోయిన్ ఆమేనట
View this post on Instagram
ఇది కూడా చదవండి :ఛీ.. ఛీ ఇదేం పాడు సినిమారా బాబు..! బట్టలు లేకుండా తిరిగే హీరో, హీరోయిన్.. చివరకు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




