AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో.. ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది.. కానీ ఇప్పుడు

చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో ఈ భామ ఒకరు. స్టార్ హీరోల సినిమాల్లో చేసింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది ఈ అమ్మడు. ఒక సినిమాలో ఏకంగా 30 లిప్ లాక్ సీన్స్ లో నటించి పాపులర్ అయ్యింది ఈ చిన్నది. ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో.. ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యింది.. కానీ ఇప్పుడు
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2025 | 12:43 PM

Share

పై ఫొటోలో ఉన్న ముడుగుమ్మను గుర్తుపట్టారా.? ఈ చిన్నది బాలీవుడ్ సినిమాతో అరంగేట్రం చేసింది. 2008లో ‘జన్నత్’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు సోనాల్ చౌహాన్. సోనాల్ మొదటి చిత్రం నుంచి నేషనల్ క్రష్‌గా మారిపోయింది. తెలుగు, హిందీ భాషల్లో చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో చేసినా.. ఈ బ్యూటీకి రావల్సినంత క్రేజ్ రాలేదు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. ఒక్క సినిమాలోనే 30 లిప్‌లాక్ సీన్స్‌లో నటించి ఈ చిన్నది కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.

1987 మే 16న నోయిడాలో సోనాల్ చౌహాన్ జన్మించింది. సోనాల్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత, సోనాల్ ఢిల్లీలోని గార్గి కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అనంతరం 2005లో మిస్ వరల్డ్ టూరిజం టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టైటిల్‌ గెలుచుకున్న తొలి ఇండియన్‌గా సోనాల్ నిలిచింది. హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్ ఆప్కా సురూర్‌లోని ‘సంఝో నా’ పాటలో సోనాల్ మొదటిసారి కనిపించింది. ఇక ఇమ్రాన్ హష్మీతో కలిసి జన్నత్(2008) చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సోనాల్. ఈ సినిమా హిట్ అయినప్పటికీ.. సోనాల్‌కి ఆ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు ఏం రాలేదు.

ఇవి కూడా చదవండి

2013లో, ‘3G- ఎ కిల్లర్ కనెక్షన్’ అనే చిత్రంలో నటించింది సోనాల్ చౌహాన్. ఇందులో నీల్ నితిన్ ముఖేష్‌ హీరోగా నటించాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. కానీ రికార్డు బ్రేకింగ్‌గా ఈ చిత్రంలో 30 కిస్ సీన్స్ ఉన్నాయి. గతంలో ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ చిత్రం మర్డర్ సినిమాలో అత్యధికంగా 20 కిస్ సీన్స్ ఉండగా.. ఆ రికార్డును3G సినిమా(30 కిస్ సీన్స్) బ్రేక్ చేసింది. సోనాల్ చౌహాన్ హిందీతో పాటు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఆమె మొదటి తెలుగు చిత్రం రెయిన్‌బో(2008). ఆ తర్వాత నాగార్జున, ప్రభాస్, రవితేజ, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక సోనాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్