Bramhamudi- Nainisha: ప్రేమలో బ్రహ్మముడి అప్పు.. ప్రియుడిని పరిచయం చేస్తూ ఎమోషనల్ పోస్ట్.. ఇంతకీ ఎవరితను?
బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ అప్పుడు అలియాస్ నైనిషా రాయ్ తన ఫ్యాన్స్‌కి ఒక శుభవార్త చెప్పింది. తన లవర్‌ని పరిచయం చేస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టిందీ అందాల తార. దీంతో ప్రస్తుతం వీరిద్దరి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

టాలీవుడ్ బుల్లితెర ఆడియెన్స్ కు నైనిషా రాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అదే నండి మన బ్రహ్మముడి సీరియల్ లో అప్పు. ఈ సీరియల్ లో టామ్ బాయ్ లా కనిపించే నైనిష ను చూస్తే పక్కింటమ్మాయిలా కనిపిస్తుంటుంది. కానీ ఆమె బెంగాలీ అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు. తెలుగులో బ్రహ్మముడి తో సహా ఇప్పటివరకూ ఎన్నో సీరియల్స్ చేసింది నైనిషా. అయితే అప్పు రోల్ నైనిష క్రేజ్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఈ సీరియల్ లో మొదట రౌడీ బేబీగా కనిపించిన నైనిష తర్వాత పోలీస్ అయిపోయి ఆడియెన్స్ కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది. సీరియల్స్, టీవీ షోస్ సంగతి పక్కన పెడితే.. నైనిషా రాయ్ తన అభిమానులకు ఓ శుభవార్త చెప్పింది. తన ప్రియుడిని పరిచయం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. ‘నా జీవితం.. నా సర్వస్వం.. నా బలం.. నా ఆనందం’.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది నైనిషా. అంతేకాదు ఈ పోస్ట్ కు లవ్ ఎమోజీలను కూడా షేర్ చేసింది.
నైనిషా రాయ్ షేర్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. క్యూట్ కపుల్, సూపర్ జోడీ, నైస్ అంటూ రిప్లై లు ఇస్తున్నారు. అలాగే అబ్బాయి ఎవరు? ఏం చేస్తుంటాడు? అని ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ నైనిష మాత్రం వీటికి రిప్లై ఇవ్వడం లేదు.
బాయ్ ఫ్రెండ్ తో నైనిషా రాయ్..

Bramhamudi, Nainisha 1
కాగా చైల్ ఆర్టిస్టుగా పలు బెంగాలీ సినిమాల్లో నటించింది నైనీష. ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో భాగ్య రేఖ, శ్రీమంతుడు, ఇంటిగుట్టు, బ్రహ్మముడి తదితర సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. ముఖ్యంగా బ్రహ్మముడి సీరియల్ నైనిషకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
నైనిషా రాయ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
ట్రెడిషినల్ లుక్ లో ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








