AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాడు నా ఫస్ట్ ఫ్రెండ్.. అయినా నా సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు.. షాకింగ్ విషయం చెప్పిన అనిల్ రావిపూడి

ఎఫ్ 2,ఎఫ్ 3 వంటి సూపర్ హిట్స్ తర్వాత వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు అనిల్.

వాడు నా ఫస్ట్ ఫ్రెండ్.. అయినా నా సినిమాలో ఛాన్స్ ఇవ్వలేదు.. షాకింగ్ విషయం చెప్పిన అనిల్ రావిపూడి
Anil Ravipudi
Rajeev Rayala
|

Updated on: Apr 24, 2025 | 6:03 PM

Share

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న విషయం తెలిసిందే.. కానీ ఈ యంగ్ డైరెక్టర్ మాత్రం ఆ సినిమాల జోలికి పోకుండా తాను నమ్ముకున్న కథతో లోకల్ గానే ఓ రేంజ్ లో హిట్స్ అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అనిల్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ దగ్గర క్యూ  కట్టారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకీ కెరీర్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

ఇక అనిల్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పటాస్ సినిమాతో అనిల్ డైరెక్టర్ గా మారాడు. ఈ సినిమా విడుదలై ఇటీవలే 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ 10ఏళ్లలో అనిల్ ఫ్లాప్ అంటూ ఎరుగకుండా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. పటాస్, సుప్రీమ్., రాజా ది గ్రేట్,సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 2, ఎఫ్ 3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో భారీ హిట్స్ అందుకొని దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే అనిల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కమెడియన్ సప్తగిరి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు. అంత బెస్ట్ ఫ్రెండ్ కు తన సినిమాలో ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదో కూడా చెప్పారు అనిల్. సప్తగిరి ఫోన్ చేసి తన సినిమాలో ఒక్క సీన్ రెండు సీన్స్ అయితే నేను చేయను అని అంటాడు. సరే రా ఫుల్ లెన్త్ క్యారెక్టర్ నీకు తగ్గది దొరికితే చేద్దాం లే అని నేను అన్నాను. కానీ ఇప్పటి వరకు అది కుదరలేదు. అదే వాడు ఒకటి రెండు సీన్స్ అయినా పర్లేదు అంటే.. వాడికి కోసం ఓ మంచి కామెడీ సీన్స్ చేసేవాడిని అని సరదాగా చెప్పుకొచ్చారు అనిల్. అలాగే సప్తగిరి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ గా ఉన్నప్పటి నుంచి మేము మంచి ఫ్రెండ్స్ అని అనిల్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?