AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే

సినిమాల్లో తమ పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు తమ పాత్రతో సినిమాకు ఎంతో ప్లస్ అవుతూ ఉంటారు. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్న కొన్ని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. అలాంటి పాత్రలో చేయడం లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు నటుడు మురళీశర్మ.

ఈ టాలీవుడ్ విలన్ భార్య స్టార్ హీరోయినా.! ఎవరో తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
Tollywood Actor Murali Shar
Rajeev Rayala
|

Updated on: Apr 25, 2025 | 11:20 AM

Share

సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకొక్కసారి సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సినిమాల్లో కొన్ని పాత్రలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. అలాంటి పాత్రలో చేయడం లో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు నటుడు మురళీశర్మ. ఎన్నో అద్భుతమైన పాత్రలో మెప్పించాడు ఈ విలక్షణ నటుడు. విలన్ గా మెప్పించిన మురళి శర్మ.. తండ్రి పాత్రల్లోనూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. అలా వైకుంఠపురం లో సినిమాలో మురళీ శర్మ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ఆయన అల్లు అర్జున్ తండ్రి పాత్రలో నటించారు.

మురళీ శర్మ టీవీ సీరియల్స్‌లో నటించి ఆతర్వాత సినిమాల్లోకి వచ్చారు. మురళీ శర్మ ముందుగా హిందీ సినిమా రాజ్ లో నటించారు. ఆ తర్వాత  షారుఖ్‌ఖాన్ మైహూనా లో నటించాడు. ఇక తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలో విలన్ గా నటించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మురళీ శర్మ. ఆ తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేశారు మురళీ శర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు ఈ వర్సటైల్ యాక్టర్.

మురళీశర్మనే కాదు ఆయన భార్య కూడా సినిమాల్లో నటిస్తారు. ఆమె కూడా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. మురళీ శర్మ భార్య పేరు.. అశ్వినీ కల్‌శేఖర్. ‘బ్రదినాథ్’ సినిమాలో విలన్ సర్కార్ భార్యగా నటించింది ఈవిడే. ఈ సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. అశ్వినీ కల్‌శేఖర్ మరాఠీ టెలివిజన్, హిందీ సినిమా, టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించారు. తెలుగులో అల్లు అర్జున్ బ్రదినాథ్ సినిమాతో పాటు రవి తేజ హీరోగా నటించిన నిప్పు సినిమాలోనూ విలన్ భార్యగా నటించారు అశ్వినీ కల్‌శేఖర్. ఆకాష్ పూరి హీరోగా నటించిన మెహబూబా సినిమాలోనూ నటించింది అశ్వినీ కల్‌శేఖర్. ప్రస్తుతం అశ్వినీ కల్‌శేఖర్ హిందీ సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. మురళీ శర్మ తెలుగు సినిమాలు చేస్తుంటే.. ఆయన భార్య అశ్వినీ కల్‌శేఖర్ హిందీలో సినిమాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Murali Sharma

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే