AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి ఇంటికి పని చేశాడు.. ఇప్పుడు తెలుగులో తోప్ నటుడు

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉన్న క్యారెక్టర్‌ ఆర్టిస్టుల్లో ఈ నటుడు కూడా ఒకరు. నాటక రంగం నుంచి వచ్చిన సుమారు అతను ఇప్పటివరకు సుమారు 40కు పైగా సినిమాల్లో నటించాడు. హీరో స్నేహితుడిగా, విలన్‌గా, కమెడియన్ గా నటించి మెప్పించాడు.

అప్పుడు అల్లు అర్జున్, చిరంజీవి ఇంటికి పని చేశాడు.. ఇప్పుడు తెలుగులో తోప్ నటుడు
Tollywood Actor
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2026 | 2:44 PM

Share

సినిమాల్లో హీరోలు హీరోయిన్స్ మాత్రమే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా గుర్తుండిపోయే నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతే కాదు తమ నటనతో పాత్రకు ప్రాణం పోస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. చాలా మంది మంది నటీనటులు స్టార్ హీరోలకు మించి గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. పై ఫొటోలో కనిపిస్తున్న నటుడు చాలా ప్రత్యేకంగా.. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే కాదు తన మాట్లతోనూ ఎంతో మందిని కట్టిపడేశాడు. అయితే చాలా మంది లాగే ఈ నటుడు కూడా సినిమాల్లోకి రాక ముందు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పొట్ట కూటి కోసం చేతికందివచ్చిన పనులన్నీ చేశాడు. పదో తరగతి తర్వాత చదువు మానేసిన ఇతను బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆతర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు

పొట్ట కూటి కోసం ఈ మహా నగరంలో చిన్నా చితకా పనులు చేశాడు. చివరకు కూలీ పనులు కూడా చేశాడు. అలా హైదరాబాద్ లో ఎందరో సినీ ప్రముఖుల ఇంటి నిర్మాణంలో కూడా పని చేశాడు ఆయన. అతను ఎవరో కాదు నటుడు మీసాల లక్ష్మణ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంటికి, అల్లు అరవింద్ గారి ఇంటికి, అలాగే అల్లు అర్జున్ ఇళ్ల నిర్మాణంలో భవన నిర్మాణ కూలీగా పని చేశా అని తెలిపాడు.. అలాగే ఫిలిం నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి కూడా వర్క్ చేశాడు. వీరితో పాటు దిగ్గజ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇంటి నిర్మాణంలో కూలీగా పనిచేశాడు. అయితే కూలీ పనులు చేస్తూనే తనలోని నటనపై ఆసక్తిని తన నటనకు మెరుగులు దిద్దుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90’స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం

నాటికలు, నాటకాలు, స్టేజ్ షోలు చేస్తూనే యాక్టింగ్ లో శిక్షణ తీసున్నాడు. స్వయంకృషితో తనకున్న పరిచయాలతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కమెడియన్ గా, విలన్ గా, సహాయక నటుడిగా ఇప్పటివరకు సుమారు 40 సినిమాలు చేశాడు. కో అంటే కోటి సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రతినిధి, నగరం నిద్రపోతున్న వేళ, శమంతక మణి, వంగవీటి, రాధ, ఘాజీ, మనమంతా, ఆర్ ఎక్స్ 100, జార్జ్ రెడ్డి, పలాస, జాంబిరెడ్డి, భీమ్లా నాయక్, మంగళవారం, తంత్ర, సరిపోదా శనివారం, శంబాల.. ఇలా దాదాపు 40 కు పైగా సినిమాల్లో నటించాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే పాయల్ రాజ్ పుత్ నటించిన ‘మంగళవారం’ సినిమాలో తన  నటనతో కట్టిపడేసాడు లక్ష్మణ్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఇది కూడా చదవండి : 12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త.. ఈ నటి జీవితంలో ఇంత విషాదమా..!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us