AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త.. ఈ నటి జీవితంలో ఇంత విషాదమా..!!

నటి సరిత ప్రస్థానం గ్లామర్‌కు అతీతం. కే.బాలచందర్ వంటి దర్శకులకు ఆమె నటన ప్రధాన ఆయుధం. బాల్య వివాహం నుండి విడాకుల వరకు వ్యక్తిగత సవాళ్లను ఎదుర్కొంటూనే, ఆమె నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అద్భుతమైన ప్రతిభను చాటారు. దక్షిణాది సినీ చరిత్రలో ఆమెకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.

12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త.. ఈ నటి జీవితంలో ఇంత విషాదమా..!!
Actress Saritha
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2026 | 6:04 PM

Share

దక్షిణాది సినీ చరిత్రలో, కేవలం అందం, గ్లామర్‌తో కాకుండా అసాధారణమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కొద్దిమంది నటీమణులలో సరిత అగ్రస్థానంలో ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె  వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సరితకు చిన్నతనంలోనే 12-13 ఏళ్ల వయసులో బాల్య వివాహం జరిగింది. అప్పటి పరిస్థితుల్లో ఇది సాధారణమే అయినప్పటికీ, సరిత దీనిని తీవ్రంగా వ్యతిరేకించి, న్యాయస్థానాన్ని ఆశ్రయించి వివాహాన్ని రద్దు చేయించుకున్నారు. ఆ తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాలనే కోరికతో మద్రాస్ చేరుకున్నారు. దర్శకుడు కే.బాలచందర్ తన మరోచరిత్ర చిత్రం కోసం హీరోయిన్ల కోసం అన్వేషిస్తున్న సమయంలో, కేవలం అందం, ఎత్తు, రంగు వంటివి పక్కనపెట్టి, పాత్రకు తగ్గ నటనను మాత్రమే చూశారు. అప్పట్లో బొద్దుగా, ఎత్తు తక్కువగా ఉన్న సరితను 162 మంది ఆడిషన్లలోంచి ఎంపిక చేశారు. కమల్ హాసన్ సరసన మరోచరిత్రలో ఆమె నటన తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

సరిత కేవలం మరోచరిత్రతోనే ఆగలేదు. బాలచందర్‌తో ఏకంగా 23 చిత్రాలలో నటించి రికార్డు సృష్టించారు. ఇది ఒక దర్శకుడు ఒకే నటితో ఇన్ని సినిమాలు చేయడం అరుదైన విషయం. పాత్ర కోసం గుండు చేయించుకోవడం, క్యాన్సర్ రోగిగా, పల్లెటూరి పిచ్చి మహిళగా, తన్నీర్ తన్నీర్లో పల్లెటూరి మహిళగా తన నటనతో జీవం పోశారు. చిరంజీవితో 47 డేస్, కలియుగ పాండవులు, మహేష్ బాబుతో అర్జున్లో విలన్ పాత్రలో ఆమె ప్రదర్శించిన నటనకు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. డాక్టర్ రాజ్‌కుమార్, విష్ణువర్ధన్, శివాజీ గణేశన్ వంటి ఇతర భాషల అగ్రతారలతోనూ అనేక చిత్రాల్లో నటించి, సహజ నటికిగా తనను తాను నిరూపించుకున్నారు.

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

సరిత మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టుగా డబ్బింగ్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఆమె స్వరం సుహాసిని, విజయశాంతి, రమ్యకృష్ణ, శ్రీదేవి, భానుప్రియ, రాధ వంటి అనేక మంది హీరోయిన్లకు సినిమాలలో ప్రాణం పోసింది. ముఖ్యంగా విజయశాంతికి ఆమె స్వరం గొప్ప బలాన్నిచ్చింది. అమ్మోరు, అంతఃపురం, మావిచిగురు, మా ఆయన బంగారం చిత్రాలకు ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా నంది అవార్డులు గెలుచుకున్నారు. కలైమామణి అవార్డు, సైమా అవార్డులు కూడా ఆమె ప్రతిభకు లభించిన గౌరవాలు. మలయాళ నటుడు ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆమె జీవితంలో ఒక తప్పుడు అడుగు అని.. గర్భవతిగా ఉన్న సమయంలో ముఖేష్ ఆమెను కాలితో తన్నారని, ఈ ఘటన తర్వాత ఆమె పిల్లలతో కలిసి దుబాయ్ వెళ్లి స్థిరపడ్డారని వార్తలు వచ్చాయి. అక్కడ తన పిల్లలను బాగా చదివించుకుని, వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. విడాకుల విషయంలోనూ ఆమె సవాళ్లను ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us