AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.? మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక యాక్షన్ డ్రామా 'స్పిరిట్' . కాంబినేషన్ ప్రకటన నుంచే ఈ సినిమాపై సినీ ప్రియుల్లోనూ, అభిమానుల్లోనూ అపారమైన అంచనాలు నెలకొన్నాయి .

ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా.? మీరు అనుకుంటున్న వ్యక్తి కాదు
Prabhas
Rajeev Rayala
|

Updated on: Aug 14, 2026 | 1:32 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. వరుస సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. డార్లింగ్ లైనప్ చూస్తే మెంటలెక్కుతుంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు ప్రభాస్. చివరిగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా ఆకట్టుకోలేకపోయింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకోలేకపోయింది. దాంతో డార్లింగ్ నెక్స్ట్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా , హనురాఘవపుడి డైరెక్షన్లో ఫౌజి, అలాగే ప్రశాంత్ నీల్ సలార్2, నాగ్ అశ్విన్ కల్కి2 ఇలా చాలా సినిమాలు ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ అయ్యాడు..! పెద్ద హీరో అయ్యుండి కూడా నా కాళ్లు పట్టుకున్నాడు

సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రభాస్ కు సంబంధించిన ఒక విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. సోషల్ మీడియాలో తన సినిమా అప్డేట్స్ తో పాటు ఇతర సినిమాలకు కూడా సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నాడు. ఇక సోషల్ మీడియాలో అందులోనూ ఇన్ స్టా గ్రామ్ లో ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో ప్రభాస్‌కు 13 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : శ్రీదేవితో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? 90’స్ కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె.. ఇప్పటికీ అదే అందం

ఇదిలా ఉంటే ప్రభాస్ ఇన్ స్టాలో ఫాలో అయ్యే ఒకేఒక్క టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా.? అవును ప్రభాస్ ఇన్ స్టాలో ఎక్కువ మందిని ఫాలో అవ్వడం లేదు. ఆయన 28మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. కాగా వారిలో తనతో పని చేసిన హీరోయిన్స్,అలాగే దర్శకులు మాత్రమే ఉన్నారు. ఇక అమితాబ్ బచ్చన్, అనుపమ్ కేర్, కమల్ హాసన్, వివేక్ ఓబేరాయ్ వంటి వారిని రెబల్ స్టార్ ఫాలో అవుతున్నాడు. ఇక ఆయన ఫాలో అవుతున్న ఒకే ఒక్క తెలుగు హీరో ఎవరో కాదు. అందరూ రానా అనుకుంటారు. రానాకు ప్రభాస్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. అకాగే గోపీచంద్ తో కూడా.. కానీ ఈ ఇద్దరూ కాదు. ప్రభాస్ ఫాలో అయ్యేది ఆయన పెద్దనాన్న దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇన్ స్టా అకౌంట్ ను. తెలుగు ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్ర వేసిన కృష్ణం రాజు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలాగే ప్రభాస్ తో కలిసి బిల్లా, రెబల్, రాధే శ్యామ్ సినిమాల్లో నటించారు.

ఇది కూడా చదవండి : 12 ఏళ్ల వయసులోనే పెళ్లి.. నిండు గర్భంపై కాలితో తన్నిన భర్త.. ఈ నటి జీవితంలో ఇంత విషాదమా..!!

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us