- Telugu News Photo Gallery Cinema photos Fight between nayanthara tamanna bhatia about lady super star award
నయనతార నాకు వద్దు అంటుంటే.. తమన్నా నాకు కావలి అంటుంది.. ఏంటో తెలుసా ??
మాకు స్టార్ ట్యాగ్స్ అవసరం లేదు అంటూ కోలీవుడ్ హీరోలు ప్రెస్ నోట్స్ రిలీజ్ చేస్తుంటే.. హీరోయిన్లు మాత్రం ఈ ట్యాగ్స్ విషయంలో ఒక్కోక్కరు ఒక్కో ఆలోచనతో ఉన్నారు. రీసెంట్‌టైమ్స్‌లో చాలా మంది అందాల భామలు అభిమానులు తమను ప్రేమగా పిలుచుకునే స్టార్ ట్యాగ్స్ గురించి మాట్లాడారు. హీరోయిన్ రేంజ్, ఇమేజ్, క్రేజ్‌ను బట్టి.. ఫ్యాన్స్ వాళ్లను స్టార్ ట్యాగ్‌లతో పిలుచుకుంటారు.
Updated on: Apr 26, 2025 | 12:49 PM

హీరోయిన్ రేంజ్, ఇమేజ్, క్రేజ్‌ను బట్టి.. ఫ్యాన్స్ వాళ్లను స్టార్ ట్యాగ్‌లతో పిలుచుకుంటారు. ఈ విషయంలో హీరోయిన్ల ఒపీనియన్ ఒక్కో రకంగా ఉంది.

రీసెంట్‌గా ఓదెలా 2తో ఆడియన్స్ ముందుకు వచ్చిన తమన్నా... మిల్కీబ్యూటీ ట్యాగ్ గురించి మాట్లాడారు. అలా పిలిస్తే ఎవరి ఇష్టముండదు చెప్పండి అంటూ మురిసిపోతున్నారు.

అయితే గతంలో ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా తనను మిల్కీ బ్యూటీ అని పిలవొద్దన్నారు తమన్నా. స్టార్ ట్యాగులు తనకు ఇష్టముండదని తన పేరుతోనే పిలిస్తే ఇష్టమన్నారు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమోగానీ సడన్‌గా మిల్కీ బ్యూటీ అన్న ట్యాగ్ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు తమన్నా.

మళ్లీ యాక్టివ్ అవుతున్న సీనియర్ నటి విజయశాంతి కూడా స్టార్ ట్యాగ్ గురించి మాట్లాడారు. తన లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ కొంత మంది వాడుకున్నారు వాళ్లు కూడా బతకాలి కదా అని వదిలేశా అన్నారు విజయశాంతి.

అయితే కొద్ది రోజులుగా లేడీ సూపర్ స్టార్ ట్యాగ్‌ను ఎంజాయ్ చేస్తున్న నయన్ మాత్రం కొద్ది రోజుల క్రితమే తనకు స్టార్ ట్యాగ్‌లు పెట్టకండి అంటూ అభిమానులను కోరారు.




