Balu Movie: తస్సాదియ్యా.. ఏం మారలేదు గురూ.. బాలు సినిమా హీరోయిన్ను చూస్తే షాకే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వీలైనంత త్వరగా తన సినిమాలను కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. పవన్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ నటించిన సినిమాలను మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో బాలు ఒకటి. ఇందులో పవన్ యాటిట్యూడ్, యాక్టింగ్ అప్పట్లో కుర్రాళ్లకు వెర్రెక్కించింది. ముఖ్యంగా పవన్ స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సరికొత్త స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ అంటే పవర్ స్టార్ అని ఈ సినిమాతో మరోసారి నిరూపించారు. అప్పట్లో పవన్ డ్రెస్సింగ్, లుక్స్ కు ఫుల్ క్రేజ్ ఉండేది. అందుకే పవర్ స్టార్ సినిమా వచ్చిందంటే థియేటర్లలో జాతరే. ప్రతి సినిమాలో కొత్త కొత్త స్టైలిష్ లుక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఇక బాలు సినిమాలోని సాంగ్స్ సైతం ఎంతో హిట్టయ్యాయి. ఈ చిత్రానికి ఏ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఇందులో పవన్ జోడిగా ఇద్దరు హీరోయిన్స్ నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో శ్రియతోపాటు నేహా ఒబెరాయ్ ఇద్దరు హీరోయిన్లుగా నటించారు. శ్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించినా శ్రియా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గానే ఉంది. హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పిస్తుంది. ఇక బాలు సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసింది నేహా ఒబెరాయ్. ఈ సినిమాలో అందం, అమాయకత్వంతో కుర్రాళ్లను మాయ చేసింది. ఈ మూవీ తర్వాత మరో సినిమా చేయలేదు నేహా. దీంతో ఇప్పుడు ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. నేహా.. సెలబ్రెటీ ఫ్యామిలికీ చెందిన అమ్మాయి. ఆమె తండ్రి ధరమ్ ఒబెరాయ్. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్.
ఆయన వారసురాలిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. జగపతి బాబు హీరోగా నటించిన బ్రహ్మాస్త్రం సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యింది. 2010లో ప్రముఖ వజ్రల వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యింది. సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

Neha Oberoi
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన








