Manchu Vishnu: శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. అదే కోరుకుంటా.. మనసులో మాట బయట పెట్టిన మంచు విష్ణు
సీనియర్ నటుడు, కలెక్షన్ కిండ్ మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే మోహన్ బాబు ఇంట్లో ఇలాంటి గొడవలు రావడం టాలీవుడ్ లో తీవ్ర ప్రకంపనలు రేపాయి. తాజాగా ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మంచు విష్ణు.

మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా షూటింగ్ పనుల్లో బిజి బిజీగా ఉంటున్నాడు. గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడుతోంది. అయినా సినిమాపై ఆసక్తి తగ్గకుండా తరచూ ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా కన్నప్ప సినిమా నుంచి శివ శివ శంకరా పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమాపై వచ్చిన నెగెటివిటీ అంతా కొట్టుకుపోయింది. కాగా కన్నప్ప సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు విష్ణు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకున్నాడు. ఇదే క్రమంలో తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై కూడా స్పందించాడు. ‘ నా ఎదుట శివుడి ప్రత్యక్షమై వరమిస్తానంటే.. ఎన్ని జన్మలెత్తినా మోహన్‌బాబునే నాకు తండ్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం. నేను మా అమ్మానాన్నతో ఉండాలి. నా పిల్లలు అలాంటి కుటుంబ వాతావరణంలో పెరగాలని నాకిష్టం. మా కుటుంబంలోని కలహాలు, గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్ పడితే బాగుండనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.
ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంచు విష్ణు, మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగి బాబు, బ్రహ్మనందం, సప్తగిరి రఘు బాబు, ఐశ్వర్య రాజేష్, దేవరాజ్, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా (విష్ణు కూతుళ్లు) ఇలా భారీ తారగణంతో ఈ మూవీ తెరకెక్కుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ 25న విడుదల కానుంది. నటుడు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు.
కన్నప్ప సినిమాలోని మొత్తం పాత్రలు ఒక్క వీడియోలో..
✨ Presenting the Characters from #Kannappa🏹 ✨
Watch now! 🔥🏹#KannappaMotionposter #VishnuManchu @themohanbabu @iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar @MsKajalAggarwal #Ariaana #Viviana #AvramManchu #PreityMukhundhan @arpitranka_30 #MukeshRishi… pic.twitter.com/0jA8CEakFB
— T-Series South (@tseriessouth) February 21, 2025
శివ శివ శంకరా పాటకు సూపర్ రెస్పాన్స్..
🎶 ‘Shiva Shiva Shankaraa’ the first single from the highly anticipated #Kannappa🏹 is just released by ‘Sri Sri Ravi Shankar’ Guru Ji! ✨
🎶 Get ready to vibe with the stunning Lyrical Video from Kannappa!
🔥 Feel the energy, experience the magic!
Watch now ▶️ 🔗Telugu:… pic.twitter.com/KuNO8jBwfw
— Kannappa The Movie (@kannappamovie) February 10, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








