IND vs PAK: గెలిచేది ఆ జట్టే.. భారత్-పాక్ మ్యాచ్‌పై ఐఐటీ బాబా ప్రిడిక్షన్ వింటే మైండ్ బ్లాక్.. వీడియో
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ( ఫిబ్రవరి 23) భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో పలువురు మాజీ క్రికెటర్లు, నిపుణులు మ్యాచ్ పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ కొట్లాటకు అంతా రెడీ అయ్యింది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. ఇందులో విజయం సాధిస్తే టీమిండియా సెమీఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. మరోవైపు పాక్ ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్ర్కమించక తప్పదు. కాబట్టి ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరగవచ్చని అభిమానులు భావిస్తున్నారు. కాగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ పై ఒక్కొక్కరు ఒక్కోలా ప్రిడిక్షన్ చెబుతున్నారు. ఎక్స్‌పర్ట్స్, మాజీ క్రికెటర్లు, అభిమానులు ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఇందులో చాలామంది భారత జట్టే గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. అయితే ఇటీవల మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఐఐటీ బాబా మాత్రం షాకింగ్ ప్రిడిక్షన్ చెప్పారు. ఎప్పటిలాగే టీమిండియా నెగ్గుతుందని అస్సలు అనుకోవద్దని.. దాయాదితో పోరులో ఈసారి రోహిత్ సేనకు ఓటమి తప్పదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘నేను మొదటి నుంచి చెబుతున్నా.. ఈసారి మాత్రం భారత జట్టుకు ఓటమి తప్పదు. టీమిండియా ముమ్మాటికీ గెలవదు. విరాట్ కోహ్లీ లేదా ఇతర ప్లేయర్లు ఎవరు ఎంతమంది ఆడినా భారత్ కు పరాజయం తప్పదు. నేను ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మారదు. ఏం జరగాలని రాసి ఉందో అది జరిగి తీరుతుంది. నేను చెప్పాను కదా.. భారత్‌కు ఓటమి తప్పదు. నేను గెలవదని చెప్పానంటే.. గెలవదు అంతే! దేవుడు గొప్పా? మీరు గొప్పా?’ అని ఐఐటీ బాబా సీరియస్ కామెంట్స్ చేశారు.
భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ గురించి ఐఐటీ బాబా మాటల్లో.. వీడియో..
View this post on Instagram
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజి మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. భారత జట్టు సూపర్ ఫామ్‌లో ఉందని, జట్టు నిండా స్టార్లే ఉన్నారని, మరోవైపు పాకిస్తాన్ జట్టు గాయాలతో సతమవుతోందంటూ కౌంటర్స్ వేస్తున్నారు. ఒక వేళ మీ ప్రిడిక్షన్ రివర్స్ అయితే ఏం చేస్తారని ఐఐటీ బాబాను నెటిజన్లు ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ బాబా జోస్యం నిజమో? అబద్దమో? తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








