AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. ఈ స్టార్ హీరో, హీరోయిన్లను గుర్తు పట్టారా? నటుడి పేరు మార్మోగిపోతోంది

ఒకరు బాలీవుడ్.. ఇంకొకరు మాలీవుడ్.. ఇద్దరూ స్టార్సే. సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టులో ఈ జోడీ కూడా ఒకటి. వీరి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తరచూ కలుస్తుంటారు. మరి వీరెవరో గుర్తు పట్టారా?

సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. ఈ స్టార్ హీరో, హీరోయిన్లను గుర్తు పట్టారా? నటుడి పేరు మార్మోగిపోతోంది
Cinema Actors
Basha Shek
|

Updated on: Feb 21, 2025 | 4:41 PM

Share

పై ఫొటోలో విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్ తో పోజులిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? వీరిద్దరూ మంచి స్నేహితులు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు గా చెలామణి అవుతున్నారు. ఒకరు స్టార్ హీరోయిన్ గా సౌత్ ను ఏలేస్తుంటే.. మరొకరు విలక్షణ నటుడిగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఈ స్టార్ హీరో నటించిన ఒక సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. కనివీని ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరిపోసింది. దీంతో ఈ ట్యాలెంటెడ్ నటుడి పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. నార్త్ టు సౌత్ ఈ నటుడి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఈ ఇందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుదాం లెండి. వీరు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, మరొకరు తంగలాన్ హీరోయిన్ మాళవికా మోహనన్. విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళుతోన్న నేపథ్యంలో ఈ నటుడి గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో మలయాళ హీరోయిన్ మాళవికా మోహనన్, విక్కీ కౌశల్ ఎప్పటినుంచో మంచి స్నేహితులుగా ఉన్నారని తెలిసింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ జంటగా కనిపించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

విక్కీ కౌశల్, మాళవిక సినిమాల్లోకి రాక ముందు నుంచే మంచి స్నేహితులుగా ఉన్నారు. ఎక్కువగా కలవకపోయినా ఒకరి సినిమాలకు మరొకరు సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటుంటారు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లో కలుసుకోవడం లేదా పరస్పరం విష్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. గతంలో ఓనం పండగ సందర్భంగా మాళవిక ఇంటికి కూడా వెళ్లాడు విక్కీ కౌశల్. అలాగే పలు వేడుకలు, పార్టీల్లోనూ కలిసి కనిపించారీ స్నేహితులు.

మాళవికతో విక్కీ కౌశల్..

గతేడాది యుధ్రా సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది మాళవిక. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో పాటు కార్తీ సర్దార్ 2 సినిమా కూడా ఉంది. ఇక విక్కీ కౌశల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఛావా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

మాళవిక లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై