AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chahal-Dhanashree: ధనశ్రీతో విడాకులు.. చాహల్ చెల్లించే భరణమెంతో తెలుసా? సంపాదించిన ఆస్తులన్నీ..

గత కొన్ని రోజులుగా టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మ విడాకుల గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు వారు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇదే క్రమంలో ధనశ్రీకి చాహల్ చెల్లించే భరణంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Chahal-Dhanashree: ధనశ్రీతో విడాకులు.. చాహల్ చెల్లించే భరణమెంతో తెలుసా? సంపాదించిన ఆస్తులన్నీ..
Yuzvendra Chahal, Dhanashre
Basha Shek
|

Updated on: Feb 21, 2025 | 12:30 PM

Share

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. ఇద్దరూ గురువారం (ఫిబ్రవరి 20) న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో డైరెక్టుగా విడాకులు అని చెప్పకపోయినా అంతరార్థం అదే నని స్పష్టంగా అర్థమవుతోంది. కాగా విడాకుల తర్వాత ధనశ్రీకి పెద్ద మొత్తంలో భరణం లభించనుందని తెలస్తోంది. ఈ మొత్తం దాదాపు రూ.60 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. కాగా యుజ్వేంద్ర చాహల్ మొత్తం ఆస్తుల విలువ రూ. 45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఒక వేళ విడాకుల తర్వాత ధనశ్రీకి రూ.60 కోట్లు చెల్లించాల్సి వస్తే, చాహల్ ఇప్పటివరకు సంపాదించిన సంపదనంతా వదులుకోవాల్సిందేనని తెలుస్తోంది. అయితే భరణంపై అటు చాహల్ కానీ, ధన శ్రీ కానీ వారి కుటుంబ సభ్యులు అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు.

ధనశ్రీ వర్మ, యుజ్వేంద్ర చాహల్ ది ప్రేమ వివాహం. ఇరు కుటుంబాల సమక్షంలో 2020 డిసెంబర్ 11న వీరి వివాహం జరిగింది. ఇప్పుడు ఈ నాలుగేళ్ల వైవాహిక బంధానికి చాహల్, ధనశ్రీలు వీడ్కోలు పలికారు. కాగా వీరు గత 18 నెలలుగా విడివిడిగానే ఉన్నారట. పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు ఫ్యామిలీ కోర్టులో చాహల్, ధన శ్రీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

18 నెలలుగా విడిగానే ఉంటున్నాం..

కాగా డెంటిస్ట్ అయిన ధనశ్రీ వర్మ కొరియోగ్రాఫర్ కూడా. యూట్యూబ్ లో ఆమె డ్యాన్స్ లకు బాగా క్రేజ్ ఉంది. గతంలో శ్రేయస్ అయ్యర్ తదితర టీమ్ఇండియా క్రికెటర్లతో ధనశ్రీ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ధనశ్రీ, చాహల్ ల విడాకులకు కారణమేంటో స్పష్టంగా తెలియరాలేదు.

చాహల్ పోస్ట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!