Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood: దేశంలోనే స్టారాది స్టార్లు.. ఈ హీరోలు నెలకు ఎంత కరెంట్ బిల్ చెల్లిస్తారో తెలుసా?

సాధారణంగా ఇతర సినిమా ఇండస్ట్రీ హీరోలో పోల్చితే బాలీవుడ్ హీరోల లైఫ్ స్టైల్ కొంచెం రిచ్ గానూ ల్యావిష్ గానూ ఉంటారు. పెద్ద పెద్ద లగ్జరీ విల్లాలు, బంగ్లాల్లో నివసిస్తుంటారు. కోట్ల రూపాయల వాచెస్, లక్షలు విలువ జేసే దుస్తులు ధరిస్తుంటారు.

Bollywood: దేశంలోనే స్టారాది స్టార్లు.. ఈ హీరోలు నెలకు ఎంత కరెంట్ బిల్ చెల్లిస్తారో తెలుసా?
Bollywood Celebrities
Follow us
Basha Shek

|

Updated on: Feb 20, 2025 | 3:37 PM

స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఆ నటుడి ఆస్తి ఎంత? వాళ్ళ జీతం ఎంత? వాళ్ళ దగ్గర ఏ కార్లు ఉన్నాయి? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరి పెద్ద పెద్ద లగ్జీ ఇళ్లల్లో నివసించే బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లకు విద్యుత్ బిల్లు ఎంత ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చాలా మందికి ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ న్యూస్. బాలీవుడ్‌లోని చాలా మంది సెలబ్రిటీలకు ముంబైలో సొంత ఇళ్లు ఉన్నాయి. షారుఖ్ ఖాన్ నివాసం ‘మన్నత్’, అమితాబ్ బచ్చన్ విలాసవంతమైన బంగ్లాలతో ఇతర హీరోల నివాసాలు కూడా బాంద్రాలోనే ఉన్నాయి. ఇక సెలబ్రిటీలు తమ ఇళ్లు అందంగా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం తమ నివాసాను రంగు రంగుల లైట్లు, దీపాలతో అందంగా అలంకరిస్తారు. మరి అలాంటి సెలబ్రిటీల ఇళ్లకు పవర్‌బిల్ ఎంత ఉంటుందో తెలుసుకుందాం రండి.

  • షారుఖ్ ఖాన్ కు ముంబైలో ‘మన్నత్’ అనే పేరు మీద ఇల్లు ఉంది. ఇది చాలా పెద్దది. ఈ ఇంట్లో చాలా గదులు ఉన్నాయి. ఈ ఇంటి కోసం షారుఖ్ ఖాన్ ప్రతి నెలా రూ.43-45 లక్షల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నట్లు సమాచారం.
  • సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో డిమాండ్ ఉన్న నటుడు. అతనికి ముంబైలో చాలా ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం సల్లు గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. అతను ప్రతి నెలా 23-25 ​​లక్షల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లిస్తాడని సమాచారం.
  • ఇక అమితాబ్ బచ్చన్ ఎన్నో ఏళ్ల నుంచి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. ఆయనకు జుహులో సొంత బంగ్లా ఉంది. ఇందుకోసం బిగ్ బీ ప్రతి నెలా రూ.22-25 లక్షల విద్యుత్ బిల్లు చెల్లిస్తారట.
  • రణవీర్ సింగ్, దీపికా పదుకొనే వివాహం చేసుకుని చాలా సంవత్సరాలు అయింది. వారిద్దరూ సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ జంట ముంబైలోని 4BHK అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. ఈ జంట 13-15 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు.
  • సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ బాలీవుడ్‌లో స్టార్ కపుల్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరు ముంబైలోని సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. వారు ప్రతి నెలా రూ.30-32 లక్షల విద్యుత్ బిల్లు చెల్లిస్తారట.
  • ఇక ఆమిర్ ఖాన్ కు ముంబైలో ఒక అపార్ట్ మెంట్ ఉంది. ఆయన దీని కోసం 9-11 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారని సమాచారం.
  • విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం చేసుకున్నాక ముంబైలోనే కాపురముంటున్నారు. ఖరీదైన 4BHK అపార్ట్ మెంట్ లో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జంట ప్రతి నెలా 8-10 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు చెల్లిస్తారని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..