Tollywood: అరె ఏంట్రా ఇది! మన తెలుగు హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? ఎవరో గుర్తు పట్టారా?
సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తారు కొంతమంది హీరోలు, హీరోయిన్లు. ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ పై సహజంగా కనిపించేందుకు వారు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అవసరమైతే బరువు పెరుగుతారు, తగ్గుతారు. అలాగే సినిమాల్లో పాత్రల కోసం గుండు కూడా కొట్టించుకునే నటీనటులు చాలామందే ఉన్నారు

నల్ల లుంగీ, చొక్కాతో కాలు పై కాలు వేసుకొని స్టైల్ గా కళ్లజోడు పెట్టుకొని సోఫాలో డైనమిక్ గా మాస్ లుక్ తో కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్లలోనే నటించింది. ఎక్కువగా క్లాస్, క్యూట్ పాత్రలతోనే మెప్పించింది. అయితే ఇప్పుడు తొలిసారి ఓ ఊర మాస్ పాత్రలో కనిపించుంది. పై ఫొటో అదే. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మొదట ఇందులో ఉన్నదెవరో చాలామంది గుర్తు పట్టలేకపోయారు. ఆ తర్వాత తెలుసుకుని షాక్ అయ్యారు. మరి ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఈ బ్యూటీ మరెవరో కాదు మన ఈ రోజుల్లో, బస్ స్టాప్, జాంబి రెడ్డి సినిమాలతో మెప్పించిన హీరోయిన్ ఆనంది. ప్రస్తుతం ఆమె శివంగి అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఆనంది పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేశారు మేకర్స్.
దేవరాజ్ భరణి ధరణ్ తెరకెక్కిస్తోన్న శివంగి సినిమాలో ఆనందితో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మార్చి 7న ఈ శివంగి సినిమా రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు.
శివంగి సినిమాలో ఆనంది..
Happy to Unveil the Title & First look Poster of #Shivangi Movie.
Congratulating the entire team for the grand success of the film.@anandhiActress @varusarath5 @Bharanidp #NareshBabuP #AHKaashif #SamjithMohammed #RaghuKulakarni @Teju_PRO @RainbowMedia_ @firstcopymovies pic.twitter.com/z5bXujUECT
— Anil Ravipudi (@AnilRavipudi) February 19, 2025
ఇక ఆనంది విషయానికి వస్తే.. వరంగల్ లో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి ప్రస్తుతం తమిళ్ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. తెలుగులో చివరిగా నాగ చైతన్య కస్టడీ సినిమాలో నటించిందీ అందాల తార.
ఆనంది లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..