AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daaku Maharaaj OTT: ఓటీటీలో బాలయ్య డాకు మహారాజ్.. పోస్టర్‌లో ఆమె లేకపోవడంతో నెటిజన్ల ట్రోల్స్

నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

Daaku Maharaaj OTT: ఓటీటీలో బాలయ్య డాకు మహారాజ్.. పోస్టర్‌లో ఆమె లేకపోవడంతో నెటిజన్ల ట్రోల్స్
Daaku Maharaaj
Basha Shek
|

Updated on: Feb 20, 2025 | 4:40 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. కొల్లి బాబీ అలియాస్ కే.ఎస్. రవీంద్ర తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రల్లో మెరిశారు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ భారీ వసూళ్లు రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. థియేటర్లలో బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించిన డాకు మహారాజ్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈనెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది నెట్ ఫ్లిక్స్. అయితే ఇప్పుడీ పోస్టర్‌ వల్లే వివాదం మొదలైంది. డాకు మహారాజ్‌ సినిమాలో పోలీసాఫీసర్ గా ఓ కీలక పాత్ర పోషించిన ఊర్వశి రౌతేలా ఫొటో లేకపోవడంపై ఆమె ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. దబిడి దిబిడి సాంగ్‌ తో అభిమానులను ఒక ఊపు ఊపేసిన ఊర్వశికి ఇదేనా గుర్తింపు అంటూ ఓటీటీ దిగ్గజంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘ 100 కోట్ల హీరోయినే నే తీసి వేస్తారా?

అదే సమయంలో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతదేశపు మొదటి మహిళను పోస్టర్‌ నుంచి తీసేస్తారా అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి డాకు మహారాజ్‌ పోస్టర్‌లో బాలీవుడ్ బ్యూటీ ఫొటో లేకపోవడం నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, నాగసౌజన్య తెరకెక్కించిన డాకు మహారాజ్ సినిమాను నిర్మించారు. సచిన్ ఖేడ్ కర్, హిమజ, వీటివి గణేష్, ఆడుకలం నరేన్, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్ పాండే, సందీప్ రాజ్, బిగ్ బాస్ దివి, రిషి, రవికిషన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ తమన్ స్వరాలు సమకూర్చారు.

నెట్ ఫ్లిక్స్ లో బాలయ్య డాకు మహారాజ్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
తెలంగాణలో సంక్రాంతి సెలవులు అప్పుడే.. ఈసారి ఏకంగా 9 రోజులు.?
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
మీనా కూతురు నైనిక ఎంత పెద్దదైపోయిందో చూశారా? ఫొటోస్ వైరల్
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
కోహ్లీకే షాకిచ్చిన ఈ లేటెస్ట్ సెన్సేషన్ బౌలర్ ఎవరో తెలుసా?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో