Tollywood: సినిమాలో దెయ్యం.. బయట దేవత రా మామ.. వెర్రెక్కిస్తోన్న వయ్యారం..
థియేటర్లలో దెయ్యంగా భయపెట్టేసింది. కానీ బయట మాత్రం గ్లామర్ ఫోజులతో కుర్రాళ్లకు వెర్రెక్కిస్తోంది ఈ వయ్యారి. ఒక్క సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఫేమస్ అయ్యింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. సినిమాల్లో క్రేజీ రోల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

హారర్ సినిమాలు చూసే అడియన్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో ఇప్పుడు ఆ జానర్ కథలను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా మసూద. 2022లో విడుదలైన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ సాయి కిరణ్ దర్శకత్వం వహించారు. హారర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ సంగీత, యంగ్ హీరో తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్ సైతం ముఖ్య పాత్ర పోషించారు. ప్రశాంత్ విహారి సంగీతం అందించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ సత్తా చాటింది.
అయితే ఈ సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యింది ఓ అమ్మాయి. ఇందులో సంగీత కూతురిగా కనిపించి మెప్పించింది. ఆమె ఎవరో గుర్తుందా. ? ఆ అమ్మాయి పేరు బాంధవి శ్రీధర్. మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. నిజానికి ఈ సినిమా కంటే ముందు బాంధవి శ్రీధర్ జనాలకు అంతగా తెలియదు. కానీ మసూద తర్వాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె 2019 మిస్ ఇండియా రన్నరప్. అంతేకాకుండా మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్ 2019, మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచింది.
మసూద సినిమాతోపాటు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో నటించింది. కానీ మసూద సినిమాతోనే ఫేమస్ అయ్యింది. అటు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటుంది.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన








