Tollywood: 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో క్రేజీ హీరో.. నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్.. కట్ చేస్తే..
అతడు స్టార్ హీరో వారసుడు. దాదాపు 22 ఏళ్లుగా సినీరంగంలో నటుడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు దాదాపు 30 సినిమాల్లో నటించాడు. కానీ అతడు చేసిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. కట్ చేస్తే.. 67 ఏళ్ల వయసులో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ?

సాధారణంగా సినీరంగంలో సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి నటీనటులుగా వచ్చినవారు చాలా మంది స్టార్స్ గా మారారు. కానీ కొంత మంది మాత్రం అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, విమర్శలను ఎదురించి నటీనటులుగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ ఓ హీరో మాత్రం దాదాపు 22 ఏళ్లుగా సినీ పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నారు. మొత్తం 30 సినిమాల్లో నటించినప్పటికీ అన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ప్రస్తుతం అతడి ఆస్తులు రూ.130 కోట్లు. యాక్షన్ ప్యాక్ట్ పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెజన్స్ కు అతడు కేరాఫ్ అడ్రస్. అతడు మరేవరో కాదు.. హీరో సన్నీ డియోల్. 80, 90ల్లో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాడు. కానీ కొన్నాళ్లుగా అతడు నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి.
1983లో బేతాబ్ సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు సన్నీ డియోల్. ఆ తర్వాత హిందీలో అర్జున్, త్రిదేవ్, చాల్ బాజ్ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 1990లో గాయల్ సినిమాతో అతడి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డ్ సైతం అందుకున్నాడు. ఇండస్ట్రీలో యాక్షన్ చిత్రాలకు అతడే ప్రత్యేక గుర్తింపుగా మారాడు. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నాడు. 2001లో సన్నీ నటించిన గదర్ : ఏక్ ప్రేమ్ కథ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు సన్నీ డియోల్.
దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇటీవలే గదర్ 2 సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం సన్నీ డియోల్ వయసు 67 ఏళ్లు మాత్రమే. 2023లో విడుదలైన గదర్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.686 కోట్లు రాబట్టింది. ఈ సినిమా సన్నీ డియోల్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. నివేదికల ప్రకారం సన్నీ ఆస్తులు రూ.120 కోట్లు. ప్రస్తుతం అతడు లాహోర్ 1947 సినిమాలో నటిస్తున్నాడు.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన








