- Telugu News Photo Gallery Cinema photos Jabardasth Comedian Yadamma Raju Stella Raj Daughter Naming Ceremony Photos Go Viral
Yadamma Raju: గ్రాండ్‌గా యాదమ్మ రాజు కూతురి నామకరణ మహోత్సవం.. ఏం పేరు పెట్టారంటే? ఫొటోస్ ఇదిగో
జబర్దస్త్ కమెడియన్ యాదమ్మరాజు ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. అతని భార్య స్టెల్లా రాజ్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా తమ కూతురి బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు యాదమ్మ రాజు దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి.
Updated on: Feb 17, 2025 | 7:55 PM

జబర్దస్త్ ఫేమ్ కమెడియన్, నటుడు యాదమ్మ రాజు- స్టెల్లా దంపతులకు గతేడాది డిసెంబర్ లో పండంటి ఆడ బిడ్డ జన్మించింది.

తమ కూతురి ఆలనా పాలనలో బిజీగా ఉంటోన్న ఈ జంట కొద్ది రోజల క్రితం తమ బిడ్డకు గిఫ్టీ అని నిక్‌నేమ్ పెట్టుకున్నారు.

తాజాగా గిఫ్టీకి ఊయల వేడుకతో పాటు నామకరణం ఫంక్షన్ నిర్వహించారు యాదమ్మ రాజు దంపతులు. ఈ సందర్భంగా గిఫ్టీని ఊయలలో వేసి జనిస్సా రాజ్ అని పేరు పెట్టారు.

క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరిగిన ఈ నామకరణ మహోత్సవానికి పలువురు బుల్లితెర ప్రముఖులు హాజరయ్యారు.

బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్- తేజు దంపతులు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరితో పాటు జబర్దస్త్ హరి తదితరులు ఈ వేడుకలో తళుక్కుమన్నారు.

ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు బుల్లితెర ప్రముుఖులు, అభిమానులు, నెటిజన్లు యాదమ్మరాజుకు విషెస్ చెబుతున్నారు





























