CID In OTT: ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో.. సీఐడీ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో సీఐడీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 1998 లో ప్రారంభమైన ఈ టీవీ షో 2018 వరకు ఏకధాటిగా సాగింది. మొత్తం 1547 ఎపిసోడ్లు ప్రేక్షకులను ఉర్రూలూగించాయి. కొన్ని రోజుల క్రితమే సీఐడీ సీజన్ 2 కూడా ప్రారంభమైంది.

క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో సీఐడీ సీజన్ 2 ఇటీవలే ప్రారంభమైంది. మొదటి సీజన్ పూర్తయిన ఆరేళ్ల తర్వాత గతేడాది డిసెంబర్ నుంచి కొత్త సీజన్ మొదలైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ ఓటీటీలోనే ఈ క్రైమ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటి వరకూ కొత్త సీజన్ లో మొత్తం 18 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే ఇప్పుడీ షో మరో ఓటీటీలోనూ స్ట్రీమింగ్ కు రానుండటం విశేషం. రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇవాళ్టి రాత్రి శుక్రవారం (ఫిబ్రవరి 21) నుంచి రెండో సీజన్ కు సంబంధించిన అన్ని ఎపిసోడ్లు నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేస్తున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రోమో విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్. ‘సీఐడీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ దగ్గరికి కూడా వచ్చింది. సీఐడీ కొత్త సీజన్ అన్ని ఎపిసోడ్లు శుక్రవారం రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్ లో చూడండి. అంతేకాదు కొత్త ఎపిసోడ్లు ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 10 గంటలకు స్ట్రీమింగ్ అవుతాయి’ అని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.
సీఐడీ క్రైమ్ షోలో శివాజీ సతమ్, దయానంద్ శెట్టి, ఆదిత్య శ్రీవాస్తవ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఒక క్రైమ్ ను సీఐడీ టీమ్ ఎలా పరిష్కరిస్తుందో ఇందులో చూపించారు. ఈ షోకు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే తొలి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ రెండో సీజన్ కు రాలేదని రివ్యూలు వస్తున్నాయి. మరి నెట్‌ఫ్లిక్స్ లో ఈ షోకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.
ఇకపై నెట్ ఫ్లిక్స్ లో నూ సీఐడీ సీజన్ 2 స్ట్రీమింగ్..
Iska matlab samjhe Daya? CID ab Netflix par bhi aa chuka hai🔥💪 Aur har Shanivaar aur Ravivaar, dekhiye naye episodes, raat 10 baje se!#CIDonNetflix pic.twitter.com/eSRZXlVFZw
— Netflix India (@NetflixIndia) February 21, 2025
CID, ab Netflix ke darwaze par bhi 🔥💥 Kal se dekhiye CID naye season ke saare released episodes Netflix par bhi! Saath hi naye episodes har Shanivaar aur Ravivaar raat 10 baje🕵️♂️#CIDonNetflix pic.twitter.com/sR7za5rg5e
— Netflix India (@NetflixIndia) February 20, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.