Taraka Ratna: దివంగత తారక రత్న భార్య, పిల్లలు ఇప్పుడెలో ఉన్నారో చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
టాలీవుడ్ హీరో నందమూరి తారకతర్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి సుమారు రెండేళ్లవుతోంది. ఇటీవల ఆయన వర్ధంతి సందర్భంగా భార్య అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన పిల్లలతో కలిసి తారకరత్నకు నివాళులు అర్పించింది.
Updated on: Feb 21, 2025 | 5:44 PM

టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న 2023 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఆయన మరణం నందమూరి కుటుంబ సభ్యులతో పాటు సినీ అభిమానులు, టీడీపీ శ్రేణులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

తారకరత్నమరణంతో ఆయన భార్య ఇప్పటికీ కోలుకోలేపోతోంది. సోషల్ మీడియా వేదికగా తరచూ తన భర్త గురించి ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తోంది.

అలా ఇటీవల తారకరత్న వర్దంతి సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది అలేఖ్య. 'ఈ ప్రపంచంలో నువ్వు లేని లోటు పూడ్చలేనిది' అంటూ భావోద్వేగానికి లోనైం

తారకరత్న- అలేఖ్యరెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. పెద్ద కూతురు పేరు నిష్క కాగా, కవల పిల్లలు తాన్యారామ్, రేయా

కాగా ఈ ముగ్గురి పిల్లలకు ఎన్టీఆర్ పేరు వచ్చేలా పేర్లు పెట్టారు. మొదట పుట్టిన పాపకు నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలుగా పుట్టారు. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు.




