Sankranthiki Vasthunam: అఫీషియల్.. ఓటీటీలో కంటే ముందే టీవీలో సంక్రాంతికి వస్తున్నాం.. టెలికాస్ట్ టైమింగ్స్ ఇవే
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లు నగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా వెంకీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి పండగ విజేతగా నిలిచాడు వెంకీమామ. జనవరి 14న రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనతో పాటు బుల్లిరాజు కామెడీ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయని చెప్పుకోవచ్చు. థియేటర్లలో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వారికి షాక్ తగిలింది. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలో కంటే ముందే టీవీలో టెలికాస్ట్ కానుంది. ఈ సినిమా డిజిటల్ అండ్ శాటి లైట్ రైట్స్ ను జీ5 సంస్థ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సంక్రాంతికి వస్తున్నాం టీవీ ప్రీమియర్ పై అధికారిక ప్రకటన వెలువడింది. మార్చి 1 (శనివారం) సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ఈ సినిమా ప్రసారం కానుంది.
సాధారణంగా ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలయ్యాక కొన్ని వారాలకు ఓటీటీలోకి అడుగుపెడుతుంది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఓటీటీలో కంటే ముందే ఈ సినిమాను టీవీల్లో ప్రసారం చేయనుంది. మరోవైపు ఈ బ్లాక్ బస్టర్ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
మార్చి 1న జీ తెలుగులో
The blockbuster date of #SankranthikiVasthunnam is 𝐌𝐀𝐑𝐂𝐇 𝟏𝐬𝐭 💥🔥
StayTuned to #ZeeTelugu 💥#SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam #FirstTVloVasthunnam #SVonTV #SankrathikiVasthunnamFirstOnTV@VenkyMama @anilravipudi… pic.twitter.com/LUa1F3tkbu
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 22, 2025
అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఉపేంద్ర లిమాయే, సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, నరేష్, వీటీవీ గణేష్, పృథ్వీ రాజ్, శ్రీనివాస అవసరాల, శ్రీనివాస రెడ్డి, మురళధర్ గౌడ్, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరిలియో స్వరాలు అందించారు. మరి థియేటర్లలో ఈ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యారా? అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి . ఎంచెక్కా ఇంట్లోనే చూసి కడుపుబ్బా నవ్వుకోండి..
World Television Premiere #SankranthikiVasthunam March 1st Saturday at 6pm @ZeeTVTelugu
Ad started now#Venkatesh #AishwaryaRajesh #MeenakshiChaudhary @aishu_dil pic.twitter.com/v4X3IZjCvU
— Telugu TV Updates (@telugutvupdts) February 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








