AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farah Khan: హిందూ పండగలపై వివాదాస్పద వ్యాఖ్య‌లు.. స్టార్ కొరియోగ్రాఫర్‌పై కేసు నమోదు

బాలీవుడ్ కు చెందిన ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, సినీ దర్శకురాలు ఫరా ఖాన్ అనుకోకుండా ఓ వివాదాంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఓ రియాలిటీ షోలో హిందూ పండగలపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వికాన్ అనే వ్యక్తి ఫరాఖాన్ పై కేసు పెట్టాడు.

Farah Khan: హిందూ పండగలపై వివాదాస్పద వ్యాఖ్య‌లు.. స్టార్ కొరియోగ్రాఫర్‌పై కేసు నమోదు
Farah Khan
Basha Shek
|

Updated on: Feb 22, 2025 | 2:49 PM

Share

బాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్, దర్శకురాలైన ఫరాఖాన్ ఇప్పుడు పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఓ రియాలిటీ షోలో హిందూ పండగ హోలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సారే చాఫ్రీ లోగోన్ కా ఫేవరెట్ ఫెస్టివల్ హోలీ హోతా హై’ అంటూ కామెంట్స్ చేశారు. దీని అర్థం ‘హోలీ అనేది చాఫ్రీ అనే ప్ర‌జ‌ల‌కు ఇష్టమైన పండుగ’. అయితే చాఫ్రీ అనే ప‌దం మన దేశంలో అవమానకరంగా లేదా తక్కువస్థాయి వ్యక్తులను సూచించేందుకు వాడుతుంటారు. దీంతో ఫ‌రా ఖాన్ చేసిన వ్యాఖ్య‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు నెటిజ‌న్లు. ఈ క్రమంలోనే ప్రముఖ యూట్యూబర్ హిందుస్తానీ బాహు అలియాస్ వికాస్ ఫటక్ ఫర్హా ఖాన్ కామెంట్స్ పై మండి పడ్డారు. ఫరా ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ జరిపింది, ఆమెను కఠినంగా శిక్షించాలని వారు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు వికాస్ తరఫున న్యాయ వాది మాట్లాడుతూ. ‘ఫరా ఖాన్ ప్రకటన హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉంన్నాయి. పవిత్రమైన హోలీ పండుగను వర్ణించడానికి ‘ఛాప్రి’ అనే పదాన్ని ఉపయోగించడం సరికాదు. ఇలాంటి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తుస్తాయి. మతపరమైన అశాంతికి కారణమవుతాయి’ అని పేర్కొన్నారు.

సిసింద్రీ , బోర్డర్‌, ఇరువర్‌, దిల్‌ సే, బాద్‌షా, జోష్‌, దిల్‌ చాహ్తా హై, క్రిష్‌, ఓం శాంతి ఓం తదితర బ్లాక్ బస్టర్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు ఫరా ఖాన్‌. ఇక మై హూనా సినిమాతో మెగా ఫోన్ పట్టిన ఆమె షారుఖ్ ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్ దీపిక పదుకొణెను సినిమాలకు పరిచయం చేసింది ఫరా ఖానే కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

కాగా ఇదే వికాస్ ఫటక్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌పై కూడా కేసు పెట్టారు. ఏక్తా కపూర్ కి సంబంధించిన ఆల్ట్ బాలాజీ ఓటీటీలోని వెబ్ సిరీస్‌లో వల్గర్ కంటెంట్ ఉందంటూ ఆయన ఫిర్యాదు చేశాడు. వెబ్ సిరీస్‌లోని ఒక సన్నివేశంలో యూనిఫాంలో ఉన్న సైనికుడు శృంగారంలో పాల్గొనడంపై వికాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.