Arundhati Movie: తస్సాదియ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న అరుంధతి డ్యాన్స్ టీచర్.. అసలేం మారలేదు భయ్యా..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కెరీర్ మలుపు తిప్పిన సినిమా అరుంధతి. కెరీర్ ప్రారంభంలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అద్భుతమైన నటన కనబరచి నటిగా మంచి మార్కులు కొట్టేసింది అనుష్క. ఈ మూవీతో నటిగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు... ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ మూవీస్ చాలా ఉన్నాయి. అందులో అరుంధతి ఒకటి. దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన అద్భుతమైన సినిమాల్లో ఒకటి ఈ సినిమా. హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. 2009లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అనేక అవార్డ్స్ అందుకుంది. ఈ సినిమాలో అనుష్క నటనకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకీ తెలుగులో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అరుంధతి సినిమా ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను అందించింది. ఇక ఈ సినిమాలో అనుష్కతోపాటు అర్జున్ బజ్వా సైతం కీలకపాత్ర పోషించారు.
అలాగే ఇందులో సోనూసూధ్ విలన్ పాత్రలో అదరగొట్టారు. పశుపతి పాత్రలో అద్భుతమైన నటనతో జనాలను ఆశ్చర్యపరిచారు. ఇక ఈ సినిమాలో డ్యాన్స్ టీచర్ గా కనిపించిన అందమైన నటి గుర్తుందా..? ఆమె ఈ చిత్రంలో కనిపించింది కాసేపే అయినప్పటికీ అందం, అభినయంతో జనాల హృదయాలను గెలుచుకుంది. ఆమె పేరు లీనా సిద్ధు. క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె.. అరుంధతి సినిమాలో డ్యాన్స్ టీచర్ గా కనిపించింది. ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇందులో పశుపతి దుర్మార్గానికి బలైపోయే డ్యాన్స్ టీచర్ పాత్రలో కనిపించింది. తెలుగు రాష్ట్రానికి చెందిన లీనా సిద్ధు.. తెలుగులో ఛార్మీ నటించిన కావ్య’s డైరీ, లంక, హ్యాపీ హ్యాపీగా వంటి చిత్రాల్లో నటించింది. కానీ కేవలం అరుంధతి సినిమాతోనే ఆమెకు గుర్తింపు వచ్చింది. తెలుగులోనే కాకుండా హిందీలోనూ పలు సినిమాల్లో నటించింది. కెరీర్ తొలినాళ్లల్లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషళ్ మీడియాలో వరుస పోస్టులు చేస్తుంది. తాజాగా ఆమె లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
లీనా సిద్ధు ఇన్ స్టా పోస్ట్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..