Arya Movie: అయ్యా బాబోయ్.. ‘ఆర్య’ హీరోయిన్ ఈ రేంజ్లో మారిపోయింది.. ఇన్నాళ్లు ఏమైపోయింది..
ఈ సినిమా వస్తుందంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు అడియన్స్. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం, పాటలు ఇప్పటికీ శ్రోతల హృదయాలను హత్తుకుంటాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. నవ్విస్తూనే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. ఫీల్ మై లవ్ అంటూ బిగ్ స్క్రీన్ పై మాయ చేశాడు. సుకుమార్, బన్నీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది.
టాలీవుడ్ అడియన్స్ మనసులలో నిలిచిపోయిన అందమైన ప్రేమకథలలో ఆర్య ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. 2004లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. స్టోరీ కొత్తగా ఉండడం, పాటలు మరింత అద్భుతంగా ఉండడంతో ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఇప్పటికీ ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఈ సినిమా వస్తుందంటే ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు అడియన్స్. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం, పాటలు ఇప్పటికీ శ్రోతల హృదయాలను హత్తుకుంటాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. నవ్విస్తూనే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాడు. ఫీల్ మై లవ్ అంటూ బిగ్ స్క్రీన్ పై మాయ చేశాడు. సుకుమార్, బన్నీ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇది.
ఇదిలా ఉంటే.. ఈ మూవీలో బన్నీ సరసన హీరోయిన్ అను మెహతా నటించింది. అందం, అమాయకత్వం, అంతకు మించిన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్ల మనసులను దోచేసింది. కానీ ఆ తర్వాత తెలుగులో స్టార్ డమ్ అందుకోలేకపోయింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కొన్ని సినిమాల్లో నటించి నటనకు దూరమయ్యింది అను మెహతా. తెలుగులో ఆర్య తర్వాత నువ్వంటే నాకిష్టం, వేడుక, మహారాజశ్రీ వంటి చిత్రాల్లో నటించిన అనుకు.. ఆర్య తప్ప మరో ప్రాజెక్ట్ విజయాన్ని అందించలేదు.
తెలుగులో సినిమా తర్వాత అసలు అను మెహతా ఎం చేస్తుంది.. ? ఎక్కడ ఉంది ? అనే విషయాలు తెలియరాలేదు. కానీ ఇప్పుడు అను మెహతా లేటేస్ట్ ఫోటో అంటూ ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో అను ఏమాత్రం తరగని అందంతో మాయ చేస్తుంది. అయితే ఈ పిక్ ఎప్పటిది అనేది తెలియరాలేదు. కానీ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన అను మెహతా.. ఇప్పుడేం చేస్తుందనేది తెలియరాలేదు. అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.