AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: జబర్దస్త్‏లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసా.. ? ఎవరంటే..

బుల్లితెరపై జబర్దస్త్‏ కామెడీ షోకు వచ్చే రెస్పాన్స్ గురించి తెలిసిందే. సంవత్సరాలుగా టీవీరంగంలో విజయవంతంగా దూసుకుపోతున్న షో ఇదే. ఇప్పటికే ఎంతో మంది నటీనటులకు లైఫ్ ఇచ్చింది. చాలా మంది తారలు తమ ప్రతిభను జబర్దస్త్ వేదికపై బయటపెట్టారు. అయితే ఈ షోలో అత్యధిక పారితోషికం తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసుకుందామా.

Jabardasth: జబర్దస్త్‏లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్ ఎవరో తెలుసా.. ? ఎవరంటే..
Jabardasth Comedians
Rajitha Chanti
|

Updated on: Jan 29, 2026 | 11:40 PM

Share

చాలా సంవత్సరాలుగా బుల్లితెరపై సంచలనం సృష్టించిన కామెడీ షో జబర్దస్త్. ఇప్పటికీ ఈ షోకు వస్తున్న ఆదరణ తక్కువేం కాదు. టీవీలో ఈ జబర్దస్త్‌కు ఉండే పాపులారిటీ అంతా ఇంతా కాదు. అటు టీవీలు.. ఇటు సోషల్ మీడియాలో జబర్దస్త్ కామెడీ స్కిట్టులు, కామెడీ పంచులు జనాల్లో ఎంతగా పాపులర్ అయ్యాయో చెప్పక్కర్లేదు. దాదాపు గంటసేపు వచ్చే ఈ షోలో కామెడీ టైమింగ్ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా జనాల్లో ఇంపాక్ట్ చూపించింది. ఈ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. చాలా మంది నటీనటులు ఈ కామెడీ షో ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..

అయితే మీకు తెలుసా.. ? జబర్దస్త్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కమెడియన్ ఎవరో.. జబర్దస్త్ వల్ల లైమ్‌లోకి వచ్చిన వాళ్లలలో రాము ఒకరు. ప్రస్తుతం ఈ షోలో కనిపించడం లేదు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న రాము తన జబర్దస్త్ ప్రయాణం గురించి వెల్లడించారు. తాను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని, ఇకపై వెళ్లనని అన్నారు. ఈ షో ప్రారంభంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న కమెడియన్ చమ్మక్ చంద్ర అని అన్నారు. ఒక్కో ఎపిసోడ్ కోసం రూ.2 లక్షల వరకు పారితోషికం తీసుకున్నారని అన్నారు. అంటే నెలకు రూ.10 లక్షలు సంపాదించేవారట.

ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

అదే స్థాయిలో సుడిగాలి సుధీర్ సైతం పారితోషికం తీసుకునేవారట. ప్రతీ ఎపిసోడ్ కు రూ.2 లక్షలు.. ఆ తర్వాత హైపర్ ఆది, గెటప్ శీను, అదిరే అభి, ఆటోరాంప్రసాద్ వంటి వాళ్లు సైతం ఎక్కువగానే పారితోషికం తీసుకున్నారని అన్నారు. ప్రస్తుతం వీరంతా సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..