నాని రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇవే.. చేసుంటే మరోలా ఉండేదే..

Rajitha Chanti

Pic credit - Instagram

28 January 2026

న్యాచురల్ స్టార్ నాని సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా మెప్పిస్తున్నాడు. 

నిత్యం విభిన్న కంటెంట్ చిత్రాలు.. వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు ఈ హీరో.

ప్రస్తుతం ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న చిత్రంపై భారీ హైప్ నెలకొంది.

కానీ మీకు తెలుసా.. ? నాని ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ రిజెక్ట్ చేశాడో. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటికీ రిస్క్ చేయడంలో ముందుంటాడు నాని. 

నితిన్ హీరోగా కెరీర్ మలుపు తిప్పిన సినిమా ఇష్క్. వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలోనే భారీ విజయాన్ని ఇచ్చింది

కానీ ఈ మూవీకి ఫస్ట్ ఛాయిస్ నాని అంట. అప్పటికే పలు సినిమాలతో నాని బిజీగా ఉండడంతో ఈ మూవీని చేయలేకపోయారట. 

అలాగే సుధీర్ నటించిన భలే మంచి రోజు సినిమాను సైతం మిస్ అయ్యారట. సీతారామం సినిమాకు నాని ఫస్ట్ ఛాయిస్.

ఇక ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాకు సైతం నానినే ముందుగా అనుకున్నారట. కానీ అనుహ్యంగా ఈ మూవీ దుల్కర్ వద్దకు చేరింది.