AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె ఓ మెరుపుతీగ..! 17 ఏళ్లకు స్టార్ హీరోయిన్.. 18ఏళ్లకు పెళ్లి.. 19ఏళ్లకు పాపం..

సాధారణంగా ఒకటి రెండు సినిమాలతోనే ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంటారు. కానీ అప్పుడే కెరీర్ పీక్స్ లో ఉండగానే కొంతమంది చనిపోతూ ఉంటారు.

ఆమె ఓ మెరుపుతీగ..! 17 ఏళ్లకు స్టార్ హీరోయిన్.. 18ఏళ్లకు పెళ్లి.. 19ఏళ్లకు పాపం..
Tollywood Actress
Rajeev Rayala
| Edited By: |

Updated on: Nov 11, 2025 | 2:28 PM

Share

చాలా మంది హీరోయిన్స్ కు సంబంధించిన వార్తలు నిత్యం సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ ఉంటాయి.. ముఖ్యంగా హీరోయిన్స్ ఎఫైర్స్ గురించి ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఒకొక్కరు ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ పెట్టుకున్నారు అంటూ ఏవేవో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. అలాగే హీరోయిన్స్ పెళ్లి, విడాకులు గురించి కూడా వార్తలు వినిపిస్తుంటాయి. కొంతమంది హీరోయిన్ ప్రేమించిన వారి కోసం మతం కూడా మార్చుకున్న వారు ఉన్నారు. పెళ్లి తర్వాత వేరే మతంలోకి మారిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ప్రేమ కోసం ఈ చిన్నది ఏకంగా మాతం మార్చుకుంది. కానీ 19ఏళ్ల వయసులోనే దారుణంగా కన్నుమూసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ దివ్యభారతి. దక్షిణాది సినీ పరిశ్రమలో 17ఏళ్ల వయసులోనే అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది దివ్యభారతి. చిన్న వయసులోనే స్టార్ హీరోల సరసన నటించిన ఆమె 19 ఏళ్ల వయసులోనే మరణించింది. ముంబైలోని ఐదవ అంతస్తులోని అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కిందపడి మృతి చెందింది. అప్పట్లో ఆమె మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎవరో కావాలని దివ్య భారతిని పై నుంచి పడేశారని కొందరు వాదించారు. తెలుగు, తమిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది దివ్యభారతి.

కాగా దివ్య భారతి సజిద్ నదియాద్వాలా ను ప్రేమించింది. అలాగే సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. షోలా ఔర్ షబ్నం’ సినిమా షూటింగ్ టైమ్‌లో సజిద్‌తో ఆమె పరిచయం తర్వాత ప్రేమ, మ్యారేజ్‌ అంతా జరిగిపోయాయి. అలాగే 18 ఏళ్ల వయసులో సజిద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే సజిద్‌ ముస్లిం అవ్వడంతో దివ్య తల్లి మీతా.. సజిద్‌కు ఓకే చెప్పినా ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఆతర్వాత పెళ్లిగురించి హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారింది. తన పేరును సనా నదియాద్వాలాగా మార్చుకుంది.. అయితే కెరీర్ పై అది ఎఫెక్ట్ పడకుండా సీక్రెట్ గా ఉంచింది. అయితే దివ్య పెళ్లి ఆమె తండ్రికి తెలియకుండా సీక్రెట్ గా చేసుకుంది. ఆతర్వాత కొన్నాళ్ళు ఆయనకు తెలిసింది.. మొదట అసంతృపి వ్యక్తం చేసినా కూడా తర్వాత ఒప్పుకున్నారు. ఆతర్వాత కేవలం 19 ఏళ్ల వయసులో ఆమె అకాల మరణం ఇండస్ట్రీని అవాక్ అయ్యేలా చేసింది.

ఇవి కూడా చదవండి
Divya Bharti

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us