ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నిర్మాత సినిమా ఆపేశాడు..
దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ తన సినీ కెరీర్, విజయాలు, ఎదురైన సవాళ్లు, ముఖ్యంగా ఓ స్టార్ హీరోతో తాను చేయాలనుకున్న సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయాలపై గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నటుడు, దర్శకుడు దేవి ప్రసాద్ తన సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, విజయాలను, సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. దర్శకుడిగా తనకు మొదటి నుంచి పెద్దగా ప్రయత్నం లేదని, పోసాని కృష్ణ మురళి వంటి సన్నిహితులు ప్రోత్సహించేవారని పేర్కొన్నారు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుండి శ్రీహరితో ఉన్న పరిచయం, ఆప్యాయతను గుర్తుచేసుకున్నారు. శ్రీహరి ఊహించని విధంగా దాసన్న సినిమాకు తనను దర్శకుడిగా ప్రకటించారని, ప్రెస్ మీట్‌లో నెక్స్ట్ నా డైరెక్టర్ దేవి అని చెప్పిన క్షణాన్ని గుర్తుచేసుకున్నారు. ఆ సినిమా కథ, నిర్మాతలు ఎవరనేది కూడా తనకు తెలియదని ఆనాటి విశేషాలను పంచుకున్నారు దేవి ప్రసాద్. అయితే, ఆ ప్రాజెక్టు 14 రోజులు షూటింగ్ మిగిలి ఉండగా, జై కృష్ణ, శ్రీహరి మధ్య చిన్న ఈగో క్లాష్‌ల వల్ల నిలిచిపోయిందని దేవి ప్రసాద్ తెలిపారు. తరువాత వారందరూ కలిసిపోయినా, ఆ సినిమా మాత్రం బయటకు రాలేకపోయిందని అన్నారు.
ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి
శ్రీకాంత్ హీరోగా ఆడుతూ పాడుతూ చిత్రంతో దేవి ప్రసాద్ పూర్తి స్థాయి దర్శకుడిగా అరంగేట్రం చేశారు. దాసన్న రషెస్‌ను చూసి తన పనితీరును గుర్తించినందున సి.వి.రెడ్డి స్వయంగా తన ఇంటికి వచ్చి అవకాశం ఇచ్చారని దేవి ప్రసాద్ వెల్లడించారు. శ్రీకాంత్ తనను ఒక మంచి దర్శకుడిగా ప్రోత్సహించారని, తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు కూడా తనతో డైలాగులు చెప్పించేవారని గుర్తుచేసుకున్నారు. ఆడుతూ పాడుతూ వంద రోజులు విజయవంతంగా ప్రదర్శితమైంది. ఆ తరువాత లీలామహల్ సెంటర్, బ్లేడ్ బాబ్జీ వంటి చిత్రాలు కూడా వంద రోజులు నడిచి తనకు వరుస విజయాలను అందించాయని, డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి అభినందించేవారని సంతోషం వ్యక్తం చేశారు. అయితే, పాండు వంటి కొన్ని చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
మూడు వంద రోజుల చిత్రాలు ఉన్నప్పటికీ, కెరీర్‌లో అనుకున్నంత ఊపు రాకపోవడానికి కారణం ఇండస్ట్రీ కాదని, తానేనని దేవి ప్రసాద్ స్పష్టం చేశారు. తనకు కొంత స్వేచ్ఛ కావాలని, పెద్ద హీరోల చిత్రాలకు వెళితే వారు కమాండ్ చేస్తారని, ఎలా చేయాలి అని చెబుతారనే అపోహ తనలో ఉండేదని అంగీకరించారు. పరుచూరి బ్రదర్స్ వంటి పెద్ద రచయితలు రాసిన స్క్రిప్ట్‌లను మళ్ళీ తను రీరైట్ చేసుకోకుండా చేయలేనని, అది వారికి నచ్చదేమో అని ఆలోచించి మోహన్ బాబు నటించిన పొలిటికల్ రౌడీ వంటి చిత్రాల అవకాశాలను వదులుకున్నానని తెలిపారు. పాండవులు పాండవులు తుమ్మెద సమయంలో కోన వెంకట్ ద్వారా కూడా మోహన్ బాబు సినిమాకు అడిగినా తాను తప్పించుకున్నానని వెల్లడించారు. బాలకృష్ణ చిత్రం కోసం అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ, మిస్టర్ పెళ్ళికొడుకు ఫ్లాప్ తర్వాత నిర్మాత ఆ ప్రాజెక్టును వదులుకున్నారని దేవి ప్రసాద్ వివరించారు. తన మొదటి చిత్రానికి అడ్వాన్స్ తీసుకుని ఎదుర్కొన్న కష్టాల వల్ల, ఆ తర్వాత అడ్వాన్సులు తీసుకోవడానికి భయపడేవాడినని, దీనివల్ల ఐదుగురు నిర్మాతలు అడిగినా తాను వదులుకున్నానని చెప్పారు. ఈ అన్ని కారణాల వల్ల తన కెరీర్ అనుకున్నంతగా ముందుకు సాగలేదని, అది తన తప్పేనని ఇప్పుడు తెలుసుకున్నానని దేవి ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం దాసన్నతో కలిపి ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించినట్లు తెలిపారు.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




