AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్.. వినయం అంటే ఇదే అంటున్న నెటిజన్స్

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం టాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

గుడిలో గిన్నెలు కడిగిన స్టార్ హీరోయిన్.. వినయం అంటే ఇదే అంటున్న నెటిజన్స్
Priyanka Chopra
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2026 | 12:38 PM

Share

చాలా మంది సెలబ్రెటీలు బయట చాలా సింపుల్ గా ఉంటారు. కొందరు లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. బయట పెద్దగా కనిపించరు. కొంతమంది సినీ ఫంక్షన్స్ లోనూ కూడా పెద్దగా కనిపించరు. కానీ చాలా మంది చాలా సింపుల్ గా జీవించడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్  చేసిన పని ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేసింది. ఓ గుడిలో హీరోయిన్ గిన్నెలు కడిగిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. దాంతో నెటిజన్స్ అవాక్ అవుతున్నారు. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.? ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా..

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానాన్ని దక్కించుకుని, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందిన ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఇటీవల ఆలయంలో సాధారణ భక్తురాలిగా సేవ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న ఆమె, ఒక ఆలయంలో గిన్నెలు కడుగుతూ కనిపించడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా ప్రముఖులు ప్రత్యేక సదుపాయాలు పొందే పరిస్థితుల్లో, ప్రియాంక మాత్రం ఇతర భక్తుల్లానే సేవ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. మాములుగా భక్తులు తమ శక్తికి తగిన విధంగా సేవ చేస్తూ, ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతారు. ఈ క్రమంలో గిన్నెలు కడగడం, ప్రదేశాన్ని శుభ్రపరచడం వంటి పనులు కూడా భక్తి రూపంగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

ప్రియాంక చోప్రా చేసిన ఈ సేవా కార్యక్రమం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి. “ఎంత పెద్ద స్టార్ అయినా, తన మూలాలను మరచిపోలేదు”, “వినయం అంటే ఇదే” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.  ప్రియాంక చోప్రా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us