AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay TVK: విజయ్ ఏం చదువుకున్నారో తెలుసా? టీవీకే అధినేత గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు..

తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందిన హీరో విజయ్ దళపతి ఇప్పుడు రాజకీయాల్లోనూ కింగ్ గా అవతరించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో విజయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

Vijay TVK: విజయ్ ఏం చదువుకున్నారో తెలుసా? టీవీకే అధినేత గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు..
TVK Chief Vijay
Basha Shek
|

Updated on: May 04, 2026 | 5:43 PM

Share

తమిళనాడు రాజకీయ చరిత్రలో సినిమా తారలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టడం కొత్తేమీ కాదు. గతంలో సినిమాల్లో స్టార్స్ గా వెలుగొందిన ఎమ్జీఆర్, జయలలిత ముఖ్యమంత్రులుగా అధికార పీఠం ఎక్కారు. ఇప్పుడు దళపతి విజయ్ కూడా వీరి జాబితాలో చేరారు. ‘తమిళ వెట్రీ కళగం’ (టీవీకే) పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది పలికారు. సోమవారం (మే 04) వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే విజయ్ ఘన విజయం దిశగా దూసుకెళ్లుతోంది. ఈ నేపథ్యంలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు రాజకీయాల్లో కింగ్ గా మారారు విజయ్. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి.

1974, జూన్ 22న జన్మించిన విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు కాగా, తల్లి శోభా చంద్రశేఖర్ నేపథ్య గాయనిగా మంచి గుర్తింపు ఉంది. దీంత చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు విజయ్. చెన్నైలోని ఫాతిమా బాలలోక్ పాఠశాలలో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడీ హీరో. ఆ తర్వాత చెన్నైలోని ప్రతిష్టాత్మక లయోలా కళాశాలలో ‘విజువల్ కమ్యూనికేషన్’ కోర్సులో చేరాడు. కాగా చదువుకుంటున్న రోజుల్లోనే యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్నాడు విజయ్. కొన్ని సినిమాల్లోనూ అవకాశాలు సంపాదించాడు. అయితే చదువు, నటన రెండింటీని హ్యాండిల్ చేయలేక చిన్నతనంలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. చదువు కంటే నటనే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకుని తన కాలేజీ చదువును మధ్యలోనే వదిలేసి, పూర్తిస్థాయిలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

18 ఏళ్ల వయసులో ‘నాలయ ప్రియ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఇప్పటివరకు 69 చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆయన దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే, అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా ఉన్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసాధారణమైన సేవలకు గుర్తింపుగా 2007లో గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. 2009లో తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ అయ్యక్కం’ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభించారు విజయ్. ఇప్పుడు ‘టీవీకే’ పార్టీ ద్వారా ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా ఎదిగారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us