AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. ఓటీటీ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలోనూ టాప్ రేటింగ్

కొన్ని రోజుల క్రితం ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీని కూడా షేక్ చేస్తోందీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ముఖ్యంగా ఇందులోని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి.

OTT Movie: మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. ఓటీటీ ట్రెండింగ్‌లో రియల్ క్రైమ్ స్టోరీ.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: May 03, 2026 | 12:03 PM

Share

ప్రస్తుతం ఓటీటీలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను చూసేస్తున్నారు ఆడియెన్స్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా గురించే. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ రేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందించాయి. ఐఎమ్ డీబీలోనూ ఈ మూవీకి టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అమ్మాయిల కిడ్నాప్, బెగ్గర్ మాఫియా, ప్రాణాంతకమైన మెడికల్ ఎక్స్‌పెరిమెంట్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఓ రాయబారి కుమార్తె మిస్ అవుతుంది. హై ప్రొఫైల్ కేస్ కావడంతో పోలీసులు ఈ కేసును జాగ్రత్తగా తీసుకుంటారు. అయితే ఇన్వెస్టిగేషన్ లో వారికి షాకింగ్ నిజాలు తెలుస్తాయి. కిడ్నాప్ అయ్యింది ఒక్క రాయబారి కుమార్తె మాత్రమే కాదని… ఢిల్లీలో చాలా మంది అమ్మాయిలు మిస్ అయ్యారని తెలుస్తుంది. అందులోనూ మెచ్యూర్ కాని అమ్మాయిలనే కిడ్నాప్ చేసినట్లు వెలుగులోకి వస్తుంది? మరి ఈ కిడ్నాప్ మిస్టరీ వెనక ఎవరున్నారు? ఎందుకు మెచ్యూర్ కాని అమ్మాయిలనే కిడ్నాప్ చేశారు? పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరించారన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

బాలీవుడ్ నటి రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘మర్దానీ 3’. అంతకు ముందు వచ్చిన మర్దానీ (2014), మర్దానీ 2 (2019) లకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కింది. అభిరాజ్ మినావాలా తెరకెక్కించిన ఈ సినిమాలో శివానీ శివాజీ రాయ్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రాణి ముఖర్జీ అదరగొట్టింది. వీరితో పాటు జానకి బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషు సేన్ గుప్తా, ఇంద్రనీల్ భట్టాచార్య, నవేద్ అస్లామ్ తదితరులు ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో మూవీని ఎంజాయ్ చేయవచ్చు. మరి కొన్ని రోజుల్లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉంది.

నెట్ ఫ్లిక్స్ లో మర్దానీ 3 స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనెడా నుంచి వచ్చి సింగర్‌ను చంపేసిన వ్యక్తి
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
మోదీ-మెలోని మీటింగ్‌లో మెలోడీ వీడియో.. దూసుకెళ్లిన పార్లే షేర్!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షలకు పెంపు..!
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
నన్ను అమ్మేసి.. బుడ్డోడిని ఎన్ని కోట్లైనా ఖర్చు చేసి కొనేస్తాడంటా
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
'నా కాపురంలో నిప్పులు పోసింది ఈమె!' హీరో ఆరోపణపై ఖుష్బూ రియాక్షన్
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవ్వరికైనా నచ్చుద్ది
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
ఎమర్జెన్సీ అని వడ్డీలకు డబ్బులు తీసుకుంటున్నారా? జాగ్రత్త.
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
అతనిని బాగా నమ్మి మోసపోయా.. బ్రేకప్ స్టోరీ చెప్పిన అనన్య నాగళ్ల
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచిదేనా.? 99% మంది
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి
చావో రేవో తేల్చుకోనున్న చెన్నై.. టాప్ 2 కోసం గిల్ సేన గురి