AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan- Dhanush: రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే 100 కోట్ల బ్లాక్ బస్టర్

సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో చేయాల్సిన సినిమా వివిధ కారణాలతో వేరే హీరో దగ్గరకు వెళ్లడం ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అలా చేతులు మారిన సినిమాలు ఒక్కోసారి సూపర్ హిట్ అవ్వచ్చు మరోసారి ఫ్లాప్ అవ్వచ్చు.

Ram Charan- Dhanush: రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ధనుష్ సినిమా.. కట్ చేస్తే 100 కోట్ల బ్లాక్ బస్టర్
Dhanush, Ram Charan
Basha Shek
|

Updated on: May 03, 2026 | 1:07 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ మెగా హీరోకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. గేమ్ ఛేంజర్ సినిమాతో బాక్సాఫీస్ రేసులో వెనకపడిన ఈ మెగా హీరో త్వరలోనే పెద్ది సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. జూన్ 04న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తన సినిమా కెరీర్ లో కొన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు. కథ సూట్ కాకపోవడమో, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమో తదితర కారణాలతో కొన్ని మంచి సినిమాలు వదులుకున్నారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన సార్ సినిమా కూడా ఉందట. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. విద్యా వ్యవస్థలోని లోపాలను కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

అయితే సార్ సినిమా కథను దర్శకుడు మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించాడట. చెర్రీకి కూడా ఈ కథ తెగ నచ్చేసిందట. అయితే ఈ సినిమా మరీ క్లాస్ గా ఉండడం, అభిమానులకు నచ్చుతుందో? లేదో? అన్న అనుమానంతో చరణ్ ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో ధనుష్ దగ్గరకు ఈ ప్రాజెక్ట్ వెళ్లిందట. అలా మొత్తానికి సార్ సినిమా పట్టాలెక్కడం, బ్లాక్ బస్టర్ అవ్వడం చకా చకా జరిగిపోయాయి. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట బాగా వైరలవుతోంది. ఒకవేళ రామ్ చరణ్ ఈ సినిమా చేసి ఉంటే, మెగా అభిమానులు ఆశించే స్థాయి యాక్షన్, ఎలివేషన్స్ ఉండకపోవచ్చని, అందుకే రామ్ చరణ్ ఈ మూవీపై ఇంట్రెస్ట్ చూపించలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డైరెక్టర్ మాట కోసం ప్రాణం పెట్టి శ్రమించిన ఎన్టీఆర్
డైరెక్టర్ మాట కోసం ప్రాణం పెట్టి శ్రమించిన ఎన్టీఆర్
ఈ టిప్స్‌ పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే కారు నేర్చుకుంటారు..!
ఈ టిప్స్‌ పాటిస్తే కేవలం 10 రోజుల్లోనే కారు నేర్చుకుంటారు..!
ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకో
ఆదివారం తులసి మొక్కకు నీరు పోయకూడదని ఎందుకు అంటారు? నిజం తెలుసుకో
150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. OTTలో ఇప్పుడు తెలుగులోనూ..
150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. OTTలో ఇప్పుడు తెలుగులోనూ..
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్.. మ్యాచ్ గెలిస్తేనే ప్లేఆఫ్స్ ఆశలు
చియా సీడ్స్ - నిమ్మరసం నీళ్లు నిజంగానే బరువు తగ్గిస్తాయా?
చియా సీడ్స్ - నిమ్మరసం నీళ్లు నిజంగానే బరువు తగ్గిస్తాయా?
: ఏసీకి తోడుగా ఫ్యాన్ ఆన్ చేస్తే జరిగే మ్యాజిక్ ఇదే..
: ఏసీకి తోడుగా ఫ్యాన్ ఆన్ చేస్తే జరిగే మ్యాజిక్ ఇదే..
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
పాలు, పెరుగు కలిపి తింటే ఏమవుతుంది..? ఓర్నాయనో.. పెద్ద కథే ఉందిగా
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
మీ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ ఉందా? రూ.50 లక్షలు వస్తాయని తెలుసా?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?
పిల్లలు వద్దనుకోవడం నిజంగా పాపమా? అసలు నిజం ఏమిటి?