Viral Video: విడాకుల కోసం మొక్కు.. అమ్మోరు కరుణించిందని ఏకంగా 9కిలో మీటర్లు.. అలా
భార్య తన నుంచి విడిపోతుంది అని తెలిస్తే ఏ భర్త అయినా బాధలో కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ ఇక్కడో యువకుడు మాత్రం తన భార్య నుంచి విడాకుల అంగీకారం రావడంతో ఏకంగా 9 కిలో మీటర్ల సాష్టాంగ దండాలు పెడుతూ ఆలయంలో మొక్కులు తీర్చకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భార్య నుంచి విడాకులు మంజూరు కావాలన్న తన కోరిక తీరిందన్న ఆనందంలో ఓ యువకుడు ఏకంగా 9 కి.మీ. సాష్టాంగ దండాలు పెడుతూ ఆలయంలో మొక్కులు తీర్చుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సోన్హా ప్రాంతానికి చెందిన జోగేశ్ అనే ఢిల్లీలో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేసేవాడు. ఇతనికి 2022లో ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత భార్యను కూడా ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడే నివాసం ఉంటున్నాడు. అయితే ఆర్థిక సమస్యలతో భార్య భర్తల మధ్య గొడవలు ప్రారంభం అయ్యాయి. అవి కాస్తా చివరకు విడాకుల వరకు దారి తీశాయి.
ఈ గొడవల నేపథ్యంలో ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో కోర్టులో విడాలకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరిని విచారించిన కోర్టు వారికి విడాలకు మంజూరు చేసింది. అయితే తనకు భార్య నుంచి విడాకులు వస్తే బైడవా సమయ్ మాత ఆలయానికి ఇలా సాష్టాంగ దండాలతో వస్తానని మొక్కుకున్నానని, ఇప్పుడు తన కోరిక తీరడంతో మొక్కు తీర్చుకున్నట్టు జోగేష్ తెలిపాడు. ఈ మొక్కు తీర్చుకునేందుకు తనకు సుమారు 12గంటల సమయం పట్టినట్టు జోగేష్ తెలిపాడు.
వీడియో చూడండి..
At a time when divorce parties are emerging as a new hot invite, a 25-year-old man from Basti celebrated the personal milestone with a unique thanksgiving for the local deity.
Making the most of the auspicious occasion of Navratri, the newly-divorced man undertook a 9-km… pic.twitter.com/SZlQqvRMyn
— Hate Detector 🔍 (@HateDetectors) March 30, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
