AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs GT : బ్యాటా ? దుడ్డు కర్రా ? గుజరాత్ బ్యాటర్ బ్యాట్ ని స్కేలుతో కొలిచిన అంపైర్.. తర్వాత ఏమైందంటే ?

PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా మొన్న మంగళవారం (మార్చి 31) పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని పంచింది. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

PBKS vs GT : బ్యాటా ? దుడ్డు కర్రా ? గుజరాత్ బ్యాటర్ బ్యాట్ ని స్కేలుతో కొలిచిన అంపైర్.. తర్వాత ఏమైందంటే ?
Pbks Vs Gt
Rakesh
|

Updated on: Apr 01, 2026 | 1:15 PM

Share

PBKS vs GT : ఐపీఎల్ 2026లో భాగంగా మొన్న మంగళవారం (మార్చి 31) పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్ అభిమానులకు సరికొత్త వినోదాన్ని పంచింది. ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపులో హీరోగా నిలిచిన కూపర్ కోనోలీ (72 నాటౌట్) గురించి ఒకవైపు చర్చ జరుగుతుంటే, మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా బ్యాట్ విషయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

ఏం జరిగిందంటే?

గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ అవుట్ అయిన తర్వాత రాహుల్ తెవాటియా క్రీజులోకి వచ్చాడు. అతను ఇంకా స్ట్రైక్ కూడా తీసుకోలేదు, అప్పుడే ఆన్-ఫీల్డ్ అంపైర్లు అతని దగ్గరికి వెళ్లి బ్యాట్‌ను తనిఖీ చేశారు. బ్యాట్ గేజ్ టెస్ట్ నిర్వహించగా, తెవాటియా బ్యాట్ ఆ పరీక్షలో ఫెయిల్ అయింది. అంటే ఉండాల్సిన పరిమాణం కంటే ఆ బ్యాట్ లావుగా ఉందని అంపైర్లు గుర్తించారు. దీంతో తెవాటియా తన బ్యాట్‌ను మార్చుకోవాల్సి వచ్చింది. లైవ్ మ్యాచ్‌లో ఇలా బ్యాట్ చెక్ చేసి మార్పించడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

ఏమిటీ బ్యాట్ గేజ్ నియమం?

క్రికెట్ బ్యాట్ ఇష్టమొచ్చినట్టు ఉండకూడదని, దానికి కొన్ని కొలతలు ఉండాలని ఎంసీసీ చట్టం 5 స్పష్టం చేస్తోంది. 2025 ఐపీఎల్ సీజన్ నుంచి ఈ నిబంధనను మరింత కఠినతరం చేశారు.

అంచుల మందం: బ్యాట్ అంచులు 4 సెంటీమీటర్ల (1.56 అంగుళాలు) కంటే ఎక్కువ ఉండకూడదు.

బ్యాట్ లోతు : గరిష్టంగా 6.7 సెంటీమీటర్లు (2.64 అంగుళాలు) మాత్రమే ఉండాలి.

వెడల్పు: బ్యాట్ వెడల్పు 10.8 సెంటీమీటర్ల (4.25 అంగుళాలు) లోపు ఉండాలి.

ఈ కొలతల కంటే ఒక్క మిల్లీమీటర్ ఎక్కువ ఉన్నా అంపైర్లు ఆ బ్యాట్‌ను అనుమతించరు. మైదానంలోకి వెళ్లే ప్రతి బ్యాట్‌ను ఫోర్త్ అంపైర్ చెక్ చేస్తారు. ఒకవేళ మైదానంలో బ్యాట్ మార్చాల్సి వస్తే ఆన్-ఫీల్డ్ అంపైర్లు చెక్ చేస్తారు.

అనిల్ చౌదరి ఏమన్నారంటే?

ఈ వ్యవహారంపై మాజీ అంపైర్ అనిల్ చౌదరి స్పందించారు. “గతంలో చాలామంది బ్యాటర్లు నిబంధనలకు విరుద్ధంగా భారీ సైజు బ్యాట్లను వాడేవారు. దీనివల్ల బౌలర్లకు అన్యాయం జరుగుతుందని భావించి 2025లో ఈ కఠిన నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఇప్పుడు ఐపీఎల్ ప్లేయింగ్ కండిషన్స్‌లో భాగంగా ప్రతి బ్యాట్ టెస్ట్ పాస్ కావాల్సిందే. సాధారణంగా ఇవి డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చే ముందే తనిఖీ చేస్తారు, కానీ తెవాటియా విషయంలో అది ఆన్-ఫీల్డ్ లో జరగడం విశేషం” అని ఆయన వివరించారు.

మ్యాచ్ ఫలితం సంగతేంటి?

రాహుల్ తెవాటియా బ్యాట్ మారినా, పంజాబ్ కింగ్స్ జోరు మాత్రం తగ్గలేదు. గుజరాత్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 19.1 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. యువ ఆటగాడు కూపర్ కోనోలీ తన అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గట్టెక్కించాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా, ఆఖరి ఓవర్లలో పంజాబ్ బ్యాటర్ల ధాటికి తలవంచక తప్పలేదు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!