AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kota Srinivasa Rao: ఆ రోజు అలా అతడ్ని చూసి పిచ్చి పట్టిందనుకున్నా.. ఇప్పుడు లెజెండ్ అయ్యాడు..

టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ కారణజన్ముడని కొనియాడారు. చిరంజీవి అంకితభావం, తన కెరీర్ పట్ల ఆయన చూపించిన శ్రద్ధను గుర్తుచేసుకున్నారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ స్టోరీ చూసేయండి.

Kota Srinivasa Rao: ఆ రోజు అలా అతడ్ని చూసి పిచ్చి పట్టిందనుకున్నా.. ఇప్పుడు లెజెండ్ అయ్యాడు..
Kota Srinivasa Rao
Ravi Kiran
|

Updated on: Apr 01, 2026 | 1:04 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఓ అధ్యాయాన్ని లిఖించుకున్న కోట శ్రీనివాసరావు.. గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రతిఘటనతో నటుడిగా నిలదొక్కుకున్న ఆయనకు.. ఎన్టీఆర్‌తో నటించే అవకాశం మేజర్ చంద్రకాంత్ ద్వారా జస్ట్ ఛాన్స్ మిస్సయిందని.. అది తనకు తీరని లోటుగా మిగిలిపోయిందని అన్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా నంది అవార్డులు అందుకున్నప్పటికీ, ఆ ‘కారణజన్ముడి’తో ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది చదవండి: అతడి వల్లే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా.. ఓపెన్‌గా చెప్పేసిన నటి

కోట ఎదుగుదల వెనుక ఎలాంటి సినీ నేపథ్యం కానీ, గాడ్ ఫాదర్లు కానీ లేరు. కేవలం తన స్వయంకృషి, భగవంతుడు ప్రసాదించిన ‘ఆవగింజంత అదృష్టం’ వల్లే తాను ఈ స్థాయికి చేరానని ఆయన చెప్పారు. వృత్తి పట్ల ఆయనకున్న నిబద్ధత ఎంతటిదంటే, షూటింగ్ సెట్‌లో తన ప్రవర్తన శ్రీరామచంద్రుడిలా ఉంటుందని ఆయన గర్వంగా చెబుతారు. తనపై వచ్చిన కొన్ని వివాదాలను ‘పండున్న చెట్టుకే రాళ్లు’ అన్న సామెతతో కొట్టిపారేసిన ఆయన, క్రమశిక్షణ విషయంలో తన అన్నయ్య ఇచ్చిన సలహాలను ఇప్పటికీ పాటిస్తుంటానని తెలిపారు.

తన కెరీర్‌లో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి చెబుతూ ఒక కీలక సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకసారి షూటింగ్ సమయంలో మద్యం సేవించినందుకు చిరంజీవి తనను తీవ్రంగా మందలించారని, ఆ మాటలు తన అభివృద్ధిని ఆశించి చెప్పినవిగా తాను గౌరవిస్తానని కోట తెలిపారు. ప్రాణం ఖరీదు సమయంలో రాజమండ్రిలో చిరంజీవి ఓ హోటల్‌లో సాయంత్రం.. మ్యూజిక్ పెట్టి విపరీతంగా డ్యాన్స్ చేశారు. పిచ్చిగా డ్యాన్స్ చేస్తున్న ఆయన్ని అప్పుడే మొదటిసారి చూశా.. ఆ కష్టం చూసినప్పుడే ఆయన భవిష్యత్తులో పెద్ద స్టార్ అవుతారని తనకు అర్థమైందని చెప్పారు. ఖైదీ నంబర్ 786లో చిరంజీవికి విలన్‌గా నటించినప్పటి నుంచి వారిద్దరి మధ్య గౌరవప్రదమైన అనుబంధం కొనసాగుతోంది. తనలోని నటుడిని సానబెట్టుకుంటూ, వివాదాలకు దూరంగా ఉంటూ సాగిన కోట ప్రయాణం నేటి తరం నటులకు ఒక గొప్ప పాఠం.

ఇది చదవండి:  ఒక్క ఇడ్లీ కోసం ఆ కో-డైరెక్టర్ బూతులు తిట్టాడు.. తర్వాత వాడి పరిస్థితి ఇది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పోయిన వస్తువులు తిరిగి రావాలా? అప్పులు వసూలవ్వాలా? ఏ దేవుడిని..
పోయిన వస్తువులు తిరిగి రావాలా? అప్పులు వసూలవ్వాలా? ఏ దేవుడిని..
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
తులం బంగారం ధర కేవలం రూ.90 మాత్రమే.. పాలు, చక్కెర ధరలు వింటే షాక్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
సహజంగా ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోండి.. అద్భుతమైన భారతీయ హోం రెమెడీస్
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
విజయ్‌కి తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
వీరు మాములోళ్లు కాదు.. A అక్షరంతో పేరు ఉన్నవారి వ్యక్తిత్వం ఇదే
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
Garuda Purana: మరణం తర్వాత స్వర్గానికి వెళ్లాలంటే ఏం చేయాలి?
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
నెలకు రూ.10,000 పెట్టుబడి.. 10 ఏళ్లలో రూ. 34 లక్షల లాభం..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
ఇది చెంచాడు ఇస్తే చాలు.. మల్లెమొక్క గుత్తులు గుత్తులుగా..
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ
NDAకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు- ప్రధాని మోదీ