AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు!

Mango Leaf Toran: మామిడి ఆకులను సంప్రదాయంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే పండుగలు, శుభకార్యాల్లో ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కడతారు. ఇది ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం, శుభశక్తులు ప్రవేశిస్తాయని నమ్మకం. అలాగే ప్రతికూల శక్తులను దూరం చేసి, వాస్తు ప్రకారం ఇంటికి పవిత్రత, సానుకూల వాతావరణాన్ని కలిగిస్తుంది.

మామిడి ఆకుల తోరణం ఎండిపోయిందా? ఇలా చేస్తేనే శుభ ఫలితాలు పొందుతారు!
Mamidi Toranalu
Rajashekher G
|

Updated on: May 04, 2026 | 7:38 PM

Share

మామిడి ఆకులను సంప్రదాయంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే పండుగలు, శుభకార్యాల సమయంలో ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీ కటాక్షం వస్తుందని, శుభశక్తులు ప్రవేశిస్తాయని పెద్దల విశ్వాసం. గుమ్మానికి వేలాడదీసిన ఆకులు ప్రతికూల శక్తులను దూరం చేసి, సానుకూల శక్తికి మాత్రమే మార్గం కల్పిస్తాయని నమ్మకం ఉంది. వాస్తు శాస్త్రం ప్రకారం మామిడి తోరణం ఇంటికి పవిత్రతతో పాటు సానుకూల వాతావరణాన్ని అందిస్తుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు, ఐశ్వర్యం పెరగడానికి సహాయపడుతుందని చెబుతారు. అయితే తోరణాన్ని ఎక్కువ కాలం అలాగే ఉంచడం మంచిది కాదని వాస్తు సూచిస్తుంది. ఆకులు ఎండిపోతే, ఇంటి శక్తిలో కూడా స్థబ్దత ఏర్పడుతుందని, దాని ప్రభావం మన జీవితాల్లో ఒత్తిడి లేదా అడ్డంకుల రూపంలో కనిపించవచ్చని విశ్వాసం.

తోరణం ఎండిపోతే..

కొన్ని సందర్భాల్లో పనులు సజావుగా సాగుతున్నప్పటికీ అకస్మాత్తుగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు కూడా అడ్డంకులు కనిపించవచ్చు. అటువంటి సమయంలో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచడం, ముఖ్యంగా తోరణం వంటి వాటిని సమయానికి మార్చడం అవసరం అని పెద్దలు సూచిస్తారు.

తోరణం మార్చుందుకు శుభదినాలు

వాస్తు ప్రకారం మామిడి తోరణాన్ని మార్చడానికి మంగళవారం, గురువారం, శనివారం, ఏకాదశి, పౌర్ణమి వంటి రోజులు శుభప్రదంగా భావిస్తారు. పాత తోరణాన్ని సాధారణ చెత్తలో వేయకుండా, మట్టిలో పాతిపెట్టడం లేదా ప్రవహించే నీటిలో వదలడం మంచిదని సంప్రదాయం చెబుతుంది.

సానుకూల శక్తి

కొత్త తోరణాన్ని అమర్చిన తర్వాత దానిని సుమారు 10 నుంచి 15 రోజుల్లో మార్చడం ఉత్తమం అని అంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి నిరంతరంగా కొనసాగుతుందని విశ్వాసం. ఎండిన ఆకులు స్థబ్దతకు, ప్రతికూలతకు సంకేతంగా భావించబడతాయి కాబట్టి వాటిని సమయానికి తొలగించడం మంచిది.

శుభకార్యాలకు సంకేతం

మొత్తానికి, మామిడి తోరణం కేవలం అలంకరణ మాత్రమే కాకుండా శుభానికి, కొత్త ప్రారంభాలకు ప్రతీకగా కూడా భావించబడుతుంది. పూర్వకాలంలో ఇంటి గుమ్మానికి తోరణం ఉంటే అక్కడ శుభకార్యం జరుగుతోందని సమాజానికి సంకేతంగా ఉండేది. అందుకే హిందూ సంప్రదాయాల్లో పండుగలు, వేడుకలు లేదా కొత్త పనుల ప్రారంభ సమయంలో మామిడి తోరణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..
ఇంతకంటే బెస్ట్ టీమ్ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్ అంటూ..
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా
చికెన్, మటన్ కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.. తింటే ఎముకలు ఉక్కులా
మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..
మహేష్ బాబుకు మాత్రమే నేను విలన్‌గా నటిస్తా..
సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు
సినిమాను తలపించిన రియల్ స్టోరీ..14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు!
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే
వీరి బాధలన్నీ పోగొట్టడానికి వస్తున్న భారీ గ్రహం.. లక్ కలిసి వచ్చే
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఐటీఆర్ ఫైలింగ్‌కు ఈ ట్యాక్స్‌పేయర్స్‌కు ఆగస్టు 31 వరకు గడువు!
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ఆర్జీవి ఆ స్టార్ హీరోయిన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా.?
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
ధోనీ ట్రైనింగ్.. లంకపై వేటకు సిద్ధమవుతున్న పంత్.. పిక్స్ వైరల్..
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత
జాబిల్లిని ఢీకొట్టనున్న స్పేస్‌ఎక్స్ రాకెట్.. ఆ తర్వాత