AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay TVK-Chiranjeevi: టీవీకే విజయ్‌ తండ్రికి, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సంబంధమేంటో తెలుసా? అసలు ఊహించలేదుగా..

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ తమిళనాడు చరిత్రను తిరగరాశారు. డీఎంకే, అన్నాడీఎంకే లాంటి పార్టీలను వెనక్కునెట్టి తమిళనాడు పాలిటిక్స్ లో కింగ్ గా అవతరించారు. ఈ నేపథ్యంలో విజయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.

Vijay TVK-Chiranjeevi: టీవీకే విజయ్‌ తండ్రికి, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సంబంధమేంటో తెలుసా? అసలు ఊహించలేదుగా..
Vijay TVK, Chiranjeevi
Basha Shek
|

Updated on: May 04, 2026 | 4:58 PM

Share

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే అధినేత విజయ్ భారీ విజయం సాధించబోతున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ 110కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కేవలం రెండో స్థానం కోసం మాత్రమే పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి పలు విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విజయ్ తండ్రి ఎస్‌.ఏ.చంద్ర శేఖర్ గురించి. విజయ్ స్టార్ హీరో అయితే చంద్ర శేఖర్ స్టార్ డైరెక్టర్. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. మరి విజయ్ తండ్రికి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య సంబంధం ఏంటనుకుంటున్నారా? అయితే అది బ్లడ్ రిలేషన్ కాదు.. అలాగే దగ్గరి బంధులువు కాదు. వీరిద్దరి మధ్య ఉండేది సినిమా బంధం. చంద్రశేఖర్ ఒక్క తమిళంలోనే కాదు తెలుగులోనూ సినిమాలు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అరడజనకు పైగా సినిమాలు తెరెకెక్కించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. విజయ్ తండ్రి చిరంజీవి సినిమాతోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటికి ఆయన తమిళంలో కేవలం మూడు సినిమాలను మాత్రమే తీశారు. అయినా చిరంజీవి ఆయనను నమ్మి తెలుగులో మొదటి సినిమా అవకాశం ఇచ్చారు.

చంద్రశేఖర్ కూడా తనపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు. మెగాస్టార్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా మర్చిపోలేని హిట్ సినిమా ఇచ్చాడు. అదే చట్టానికి కళ్లు లేవు సినిమా. 1981లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ సంచలనంగా నిలిచింది. ఆ ఏడాది అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు.. అటు చిరంజవికి, ఇటు చంద్రశేఖర్‌కు తమ కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చట్టానికి కళ్లు లేవు తర్వాత వీరి కాంబినేషన్ లో మరో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి. పల్లెటూరి మొనగాడు, దేవాంతకుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇలా వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కమర్షియల్ హిట్స్ అయ్యాయి. ఇక్కడ ఆసక్తికర విషయమేమిటంటే.. తెలుగులో ఎస్ ఏ చంద్రశేఖర్ ఆరు సినిమాలు తీస్తే అందులో మూడు మాత్రమే హిట్ అయ్యాయి. ఆ మూడు కూడా చిరంజీవి హీరోగా నటించిన సినిమాలే. అలా సినిమాల పరంగా ఎస్ ఏ చంద్ర శేఖర్, చిరంజీవి మధ్య మంచి అనుబంధం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర