ఇందేది మావ..! ఈమె స్టార్ డైరెక్టర్ భార్యనా..!! సింగంలో అనుష్క చెల్లి ఎవరంటే..
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి. 2005లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం సూపర్ తో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత విక్రమార్కుడులో రవితేజ సరసన నటించి గుర్తింపు పొందింది. ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అరుంధతి (2009), ఇందులో ఆమె డ్యూయల్ రోల్‌లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది.

స్టార్ సూర్య నటించిన లేటెస్ట్ మూవీ కంగువ.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తొలి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ పెరుగుతోంది. ఈ సినిమాలో సూర్య నటన, దేవీ శ్రీ మ్యూజిక్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఆడియన్స్. ఇక సూర్య కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరో. ఆయన నటించిన సినిమాలు తెలుగులో మంచి విజయాలను అందుకున్నాయి. సూర్య గజినీ సినిమా నుంచి తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఆ మధ్య కంగువ ప్రమోషన్స్ లోనూ తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఎమోషనల్ కూడా అయ్యాడు. ఇదిలా ఉంటే సూర్య నటించిన సింగం సినిమా తెలుగులో యముడు అనే టైటిల్ తో విడుదలై సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే..
తండ్రి తోపు హీరో.. కూతురు మాత్రం మూడు సినిమాలకే కనిపించకుండా పోయింది.. ఆమె ఎవరంటే
సూర్య నటించిన సింగం సిరీస్ లో వచ్చిన అన్ని సినిమాలు తెలుగులోనూ సూపర్ హిట్ అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకున్నాయి. కాగా సింగం సినిమాలో సూర్యకు జోడీగా అనుష్క నటించింది. ఆతర్వాత సింగం 2లో సెకండ్ హీరోయిన్ గా హన్సిక, సింగం 3లో సెకండ్ హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించారు. అయితే మెయిన్ హీరోయిన్ గా మాత్రం అనుష్కనే నటించారు. సింగం సినిమాలో అనుష్క చెల్లెలిగా నటించిన అమ్మడు గుర్తుందా.?
నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు..!! బాబోయ్..ఒంటరిగా చూడకూడని సినిమా.. ఏకంగా మూడు ఓటీటీలో..
అనుష్క రేంజ్ లో కాకపోయినా ఆ అమ్మడు కూడా తన అందంతో ఆకట్టుకుంది, క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన ఆ చిన్నది ఎవరో తెలుసా.? ఆమె పేరు ప్రియా.. స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ సతీమణి ఈ బ్యూటీ. ప్రియా అట్లీ నటిగా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాదు ప్రియా అట్లీ సినీ నిర్మాత అలాగే వ్యాపారవేత్త కూడా.. ఈ చిన్నది అట్లీ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గాను చేస్తుంటారు. ప్రస్తుతం ప్రియా సినిమాల్లో నటించడం తగ్గించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలతో పాటు తన భర్త సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటుంది.
Bigg Boss 9: అనుకున్నదే అయ్యింది. ఈసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది అతనే.?
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




